రీసెంట్ టైంలో కోలివుడ్ టాప్ అండ్ సీనియర్ హీరోలు నటించిన సినిమాలకు వేటికి కూడా అనుకున్న రేంజ్ లో అయితే టాక్ రావడం లేదు, రీసెంట్ గా కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి రోజే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా…
మొదటి రోజు ఎలాగోలా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత రెండు మూడు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. సినిమా బడ్జెట్ దృశ్యా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా సాధిస్తున్న కలెక్షన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే…
చూపించేలా లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఇంకా భారీ లెవల్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, కమల్ హాసన్ కెరీర్ లో ఇప్పుడు రీసెంట్ గా ఆల్ టైం డిసాస్టర్ అయిన ఇండియన్ 2 సినిమాను సైతం మించి పోయే రేంజ్ లో…
డిసాస్టర్ రిజల్ట్ ను ఇప్పుడు తగ్ లైఫ్ సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఆ రేంజ్ లో సినిమా మీద సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. శంకర్, మణిరత్నం లాంటి లెజండరీ డైరెక్టర్స్ చేసిన సినిమాలకు ఇలాంటి రెస్పాన్స్ మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి.
బుక్ మై షో లో వీకేస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన తగ్ లైఫ్ సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని చూపించకుంటే మాత్రం కొన్న వాళ్ళకి ఊహకందని రేంజ్ లో లాసులు కన్ఫాం అని చెప్పాలి ఇప్పుడు… ఇక సినిమా ఏ రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేస్తుందో చూడాలి.