బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో కొన్ని డిసాస్టర్ మూవీస్ వచ్చాయి, కానీ తమిళ్ సినిమాల పరంగా అన్ని సినిమాలను మించి పోయే రేంజ్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) నటించిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా…
చూపించలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచి ఇప్పటి వరకు 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దారుణంగా విఫలం అయ్యింది. ఆల్ మోస్ట్ సినిమా 230 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
సినిమా రిలీజ్ టైంలో కమల్ హాసన్ చేసిన ఒక కామెంట్ వలన కర్ణాటకలో సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు..దాన్ని ఛాలెంజ్ చేస్తూ కమల్ హాసన్ ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు కానీ ఈ లోపు సినిమా రిలీజ్ అయ్యి కర్ణాటకలో తప్ప మిగిలిన చోట్ల ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను…
సొంతం చేసుకుని దారుణంగా విఫలం అయ్యింది, కన్నడ ఆడియన్స్ ఈ డిసాస్టర్ ని చూడకపోవడంతో ఫుల్ హ్యాప్పీగా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు ఎట్టకేలకు సుప్రీం కోర్ట్ వాళ్ళు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్ణాటకలకో రిలీజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ…
క్లీన్ చీట్ ఇచ్చేశారు…దాంతో సినిమా కర్ణాటక రిలీజ్ కి అడ్డు తొలగిపోగా సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఆల్ రెడీ కన్ఫాం అవ్వడంతో ఇప్పుడు కర్ణాటకలో సినిమా రిలీజ్ అయినా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఓవరాల్ గా అక్కడ సినిమా ఏమైనా వసూళ్ళని అందుకుంటుందో లేక డిసాస్టర్ గానే నిలుస్తుందో చూడాలి ఇప్పుడు.