ఒక్క చిన్న స్టేట్ మెంట్ ఏకంగా సినిమా రిలీజ్ పైనే భారీ ఇంపాక్ట్ చేసి భారీ ఎదురుదెబ్బని బాక్స్ ఆఫీస్ దగ్గర తగిలేలా చేసేలా ఉంది ఇప్పుడు…లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా తగ్ లైఫ్(Thug Life Movie) ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ…
ఈ గురువారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…అన్ని చోట్లా సినిమా మీద డీసెంట్ లెవల్ లో బజ్ ఉండగా సినిమా కి రీసెంట్ గా కర్ణాటకాలో బ్యాన్ గొడవ మొదలు అయింది, దానికి కారణం ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టింది అంటూ…
చెప్పడం లాంటిది కన్నడ ఆడియన్స్ కి కోపం తెచ్చేలా చేసింది. అసలే భాష విషయంలో కన్నడ ప్రజలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అదే విధంగా తమిళ్ ప్రజలు కూడా తమ భాష మీద ఎక్కువ గౌరవంతో ఉంటారు, కానీ కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్ కన్నడ ప్రజలకు కోపం తెప్పించడంతో…
కమల్ ఓపెన్ గా క్షమాపణ చెప్పకుంటే తగ్ లైఫ్ సినిమాను ఎట్టి పరిస్థితులలో కూడా రిలీజ్ చేయనివ్వం అంటూ కామెంట్స్ రాగా దీనిపై కమల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అంటూ అలానే ఉన్నాడు. దాంతో సినిమా కన్నడ రిలీజ్ ఎఫెక్ట్ అవ్వగా లీగల్ గా వెళ్ళాలి అని…
రీసెంట్ గా కోర్టులో కేసు కూడా వేశాడు కమల్ హాసన్, కోర్టు నిర్ణయం తనకి అనుకూలంగా వస్తుంది అనుకున్నాడు కానీ ఇప్పుడు అలా జరగలేదు, కోర్టు కూడా కమల్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పను అన్నాడు కాబట్టి సినిమా రిలీజ్ చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతూ..
కోర్టు కూడా కన్నడ ఆడియన్స్ కి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది, దాంతో ఇప్పుడు తగ్ లైఫ్ సినిమా రిలీజ్ అక్కడ పూర్తిగా డౌట్ లో పడింది. ఫిల్మ్ ఛాంబర్ లో ప్రస్తుతం దీనిపై మీటింగ్స్ జరుగుతున్నాయని, ఏదైనా అద్బుతం జరిగితే సినిమా రిలీజ్ అవ్వొచ్చు లేక పొతే రిలీజ్ ఉండదు అంటూ స్ట్రాంగ్ గా వార్తలు వస్తున్నాయి…