బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో…
ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుంది…అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా వచ్చేసింది…ఒకసారి ఆ టాక్ ను గమనిస్తే…కథ పాయింట్ ని ఏమి రివీల్ చేయడం లేదు కానీ ఒక గ్యాంగ్ స్టర్ అయిన కమల్ హాసన్ కి ఒక అనాధ అయిన శింబు దొరుకుతాడు, తనని పెంచుకుని పెద్దవాన్ని చేయగా..
అనుకోకుండా తన కొడుకుతోనే తనకి శతృత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ గొడవలో ఎవరు గెలిచారు అన్నది అసలు కథ పాయింట్… ఇతర ఉపకథలు సినిమాలో ఉన్నప్పటికీ మేజర్ గా కమల్ అండ్ శింబులతోనే చాలా సీన్స్ సాగగా ఫస్టాఫ్ ఓపెన్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యి..
అన్ని పాత్రల పరిచయం తర్వాత కథ మొదలు అయినా కూడా ఎందుకో కొంచం నరేషన్ చాలా స్లో గా అనిపించింది…కానీ కొంత టైం తర్వాత ఇంటర్వెల్ వరకు సినిమా బాగానే సాగి సెకెండ్ ఆఫ్ కి మంచి స్కోప్ ఉండే సీన్ తో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా…
ఇక సెకెండ్ ఆఫ్ అదిరిపోతుంది అనుకుంటే…సెకెండ్ ఆఫ్ కథ మరింత స్లో నరేషన్ తో సాగింది….అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్ పడినా కూడా ఓవరాల్ గా ఫస్టాఫే సెకెండ్ ఆఫ్ కన్నా కొంత బెటర్ అనిపించేలా సినిమా సాగింది…. సెకెండ్ ఆఫ్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది…
ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి యావరేజ్ కి అటూ ఇటూగా అనిపించింది అన్న టాక్ ప్రీమియర్స్ నుండి వినిపిస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద కమల్ అండ్ మణిరత్నం ల కాంబో నుండి..
ఇంకా ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేశామని ఆడియన్స్ చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి యావరేజ్ టు ఎబో యావరేజ్ కి మధ్యలో సినిమా ఉందని అంటున్నారు… మొత్తం మీద ప్రీమియర్స్ నుండి ఈ టాక్ ను సొంతం చేసుకున్న…
తగ్ లైఫ్ సినిమా కి ఇక రెగ్యులర్ షోలకు ఇంకా బెటర్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా మొదటి రోజు ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.