లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మణిరత్నం కాంబోలో ఆల్ మోస్ట్ 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నాయకుడు సినిమా తర్వాత చేస్తున్న కొత్త సినిమా తగ్ లైఫ్(Thug Life Movie) సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి…విక్రమ్ తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ తర్వాత ఎప్పటి నుండో డిలే అయిన…
ఇండియన్2 సినిమాతో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం కొద్దిగా ఇంపాక్ట్ ని చూపించినా ఇటు మణిరత్నం కూడా పోన్నియన్ సెల్వన్ సిరీస్ తో మంచి ఫామ్ లో ఉండగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…
రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ పనుల్లో టీం బిజీగా ఉండగా సినిమా కథ పాయింట్ కొద్ది వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండగా స్టోరీ ప్రామిసింగ్ గానే ఉందని చెప్పాలి. ఆ లీక్ అయిన కథ పాయింట్ మాఫియా వరల్డ్ ని ఒక లెవల్ లో షేక్ చేసిన కమల్ హాసన్…
ఒక ప్రమాదంలో చనిపోయాడు అని అందరూ అనుకుంటారు, కానీ తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఎవ్వరికీ చెప్పని హీరో అనుకోని పరిస్థితుల్లో తిరిగి మాఫియాలో ఎంటర్ అవ్వగా తన కొడుకు అయిన శింభు అంచలంచలుగా ఎదగడం మొదలు పెడతాడు…
ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు మొదలు అయ్యి అది ఏకంగా ఒకరంటే ఒకరికి పడని రేంజ్ కి వెళుతుంది…ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధమే తగ్ లైఫ్ అని అంటున్నారు.. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ కొంచం పర్వాలేదు అనిపించేలా ఉండగా…
మణిరత్నం తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో సినిమాను రూపొందించారని అంటున్నారు. లీక్ అయిన కథకి డీసెంట్ స్క్రీన్ ప్లే అండ్ ఎలివేషన్ లు సరిగ్గా వర్కౌట్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా లోకనాయకుడు తన రేంజ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.