లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా తగ్ లైఫ్(Thug Life Movie) ఆడియన్స్ ముందుకు జూన్ మొదటి వారంలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…ట్రైలర్ చూసిన తర్వాత….
బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందనిపించేలా మెప్పించింది ఈ సినిమా ట్రైలర్…సినిమా కథ పాయింట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఆల్ మోస్ట్ ట్రైలర్ లో చెప్పినా కొన్ని ట్విస్ట్ లు కూడా పెట్టడం బాగుంది అని చెప్పాలి…
ఓవరాల్ గా కథ పాయింట్ కి వస్తే ఓ చిన్న పిల్లోడి వల్ల హీరో ప్రాణాలతో ఉంటాడు…దాంతో ఆ పిల్లోడిని పెంచుకున్న హీరో తన తర్వాత మాఫియాకి పెద్ద పెరిగిన శింభునే అని అంటాడు. కానీ ఈ తండ్రికొడుకులుగా పెరిగిన వాళ్ళ మధ్య అనుకోకుండా జరిగిన కొన్ని గొడవలు…
ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి అన్నది సినిమా కథ పాయింట్ గా ట్రైలర్ లో చూపించారు..ఓవరాల్ గా ట్రైలర్ కట్ కానీ ఎడిటింగ్ షాట్స్ కానీ ఏ ఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మేజర్ హైలెట్ గా నిలవగా కమల్ హాసన్ మరియు శింభులు పోటి పడీ నటించినట్లు ట్రైలర్ చూస్తె తెలుస్తుంది..
ఇక ట్రైలర్ లో తన కన్నా ఏజ్ లో తక్కువ ఉన్న హీరోయిన్స్ తో కమల్ రొమాన్స్ ఒక్కటి సోషల్ మీడియాలో హెవీ ట్రోల్స్ కి కారణం అవుతున్నా కూడా ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం ఎక్స్ లెంట్ కట్ తో మెప్పించింది అని చెప్పాలి…ట్రైలర్ ఏ రేంజ్ లో మెప్పించిందో…
సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాక ఇదే రేంజ్ లో మెప్పిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాలిడ్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో కమల్ హాసన్ ఇండియన్2 డిసాస్టర్ ను ఏ రేంజ్ లో మరిపించే విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.