Home న్యూస్ తగ్ లైఫ్ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

తగ్ లైఫ్ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబుతో కలిసి మని రత్నం డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) ఆడియన్స్ ముందుకు ఈ గురువారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. సినిమా ఒక్క కర్ణాటకలో తప్పితే మిగిలిన అన్ని చోట్లా కూడా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…

ఆల్ రెడీ సినిమా మీద డీసెంట్ లెవల్ లో క్రేజ్ అన్ని చోట్లా ఉండగా తమిళ్ లో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతున్న తగ్ లైఫ్ సినిమా ఓవరాల్ గా…

తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ 11 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఇండియన్2 ఇంపాక్ట్ వలన ఈ సినిమా వాల్యూ బిజినెస్ సేఫ్ సైడ్ లోనే చేశారని అంటున్నారు…దాంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 12 కోట్ల రేంజ్ లో..

షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది….ఇక సినిమా కన్నడ కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా వాల్యూ ప్రీ రిలీజ్ రేంజ్ 105 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని అంచనా….సేఫ్ సైడ్ లోనే సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ జరగగా చాలా వరకు బడ్జెట్ కూడా…

నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే రికవరీ అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 106 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అలాగే 210 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.

సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ లెవల్ లో బజ్ ఉండటంతో టాక్ పాజిటివ్ గా వస్తే పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి లాంగ్ రన్ లో అవలీలగా సినిమా టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ ఏ రేంజ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here