Home న్యూస్ తగ్ లైఫ్ 1st డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రిపోర్ట్!!

తగ్ లైఫ్ 1st డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…

1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను తమిళ్ లో 8 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా 20.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొదటి రోజున తమిళనాడులో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. సినిమా టాక్ అక్కడ కూడా…

కొంచం మిక్సుడ్ గానే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు మంచి ఓపెనింగ్స్ నే అందుకునే అవకాశం ఉంది. మొదటి రోజు ప్రజెంట్ ఓపెనింగ్స్ పరంగా అక్కడ 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోలకు..

సినిమా హోల్డ్ ని బట్టి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు పెరుగుతాయో చూడాలి. ఇక తెలుగు లో సినిమా 2.2-2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయో చూడాలి.

ఇక కర్ణాటకలో రిలీజ్ లేక పోవడంతో హిందీ లో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్న సినిమా కేరళలో కూడా ఓకే అనిపించే రేంజ్ లో ఓపెన్ అవ్వగా ఓవర్సీస్ లో మాత్రం ఇండియాలో కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ఓపెనింగ్ డే రోజున వరల్డ్ వైడ్ గా 36-40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే అవకాశం ఉన్న సినిమా, టాక్ మరీ ఇంపాక్ట్ ని చూపించకుండా ఉంటే కనుక 40 కోట్ల పైన ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక డే 1 ఎండ్ అయ్యే  టైంకి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here