ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….గ్యాంగ్ స్టర్ అయిన కమల్ హాసన్ కి అనుకోకుండా దొరికిన ఒక బాబుని పెంచుకుని తన లానే పెద్ద గ్యాంగ్ స్టర్ ని చేస్తాడు, ఈ క్రమంలో అంచలంచలుగా ఎదిగిన ఆ కుర్రాడికి తండ్రి లాంటి కమల్ హాసన్ కి మధ్య అనుకోకుండా గొడవలు జరుగుతాయి…
ఆ గొడవలు ఎంత దూరం వెళ్ళాయి అన్నది అసలు కథ పాయింట్…చాలా నార్మల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ను మొదటి నుండి కూడా ఎమోషన్స్ ఓ రేంజ్ లో పండాయి, యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది, స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటూ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ను చేశారు…
ఇదంతా నమ్మి థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి ఒక నార్మల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా చాలా సాదాసీదా సినిమాలా అనిపిస్తుంది, కమల్ హాసన్ తన పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చాలా చేశాడు కానీ మణిరత్నం అందించిన కథ డైరెక్షన్ సినిమాకి మేజర్…
డ్రా బ్యాక్ గా మారడంతో పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది సినిమా…సినిమా ఓపెన్ అవ్వడం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఓపెన్ అయ్యి అసలు కమల్ హాసన్ ఎలా ఎదిగాడో చూపెడుతూ, శింబు, నాజర్ మరియు త్రిషలతో తన బందం గురించి పర్వాలేదు అనిపించేలా చెప్పగా…
అసలు కథ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టగా, టేక్ ఆఫ్ తర్వాత ఇంటర్వెల్ వరకు బాగానే సాగిన సినిమా తర్వాత సెకెండ్ ఆఫ్ లో గాడి తప్పింది. చాలా స్లో నరేషన్ తో సాగిన సినిమా కొన్ని చోట్ల సహనానికి పరీక్ష పెట్టింది…కమల్ హాసన్ తన వరకు ఎంత ట్రై చేసినా కథలోనే దమ్ము లేకపోవడంతో…
ఎంత చేసినా అది వృధా అయిపొయింది, ఇక శింబు రోల్ కొంచం ఓవర్ గా అనిపించింది అలాగే తన గెటప్ పెద్దగా సెట్ అవ్వలేదు అనిపించింది, నాజర్, త్రిష అభిరామి లాంటి రోల్స్ ఓకే అనిపించాయి… మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా… ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం…
ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తనా మ్యాజిక్ కనిపించలేదు, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగింది…సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…తెలుగు డబ్బింగ్ బాగానే ఆకట్టుకుంది.
ఇక మణిరత్నం డైరెక్షన్ చాలా వీక్ గా ఉంది ఈ సినిమాలో, అసలు ఎంచుకున్న పాయింటే బలం లేక పోవడంతో ఎలాగోలా తీసినట్లు అనిపించింది…మొత్తం మీద సినిమా చాలా ఓపిక చేసుకుని చూస్తె కొన్ని మంచి సీన్స్ పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా సినిమా యావరేజ్ రేంజ్ లో అనిపించవచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…