డిసాస్టర్ టాక్…206 కోట్ల ఊచకోత…కానీ!!

0
469

  బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ మరియు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీ భారీ అంచనాల నడుమ దీపావళి వీకెండ్ లో రాగా సినిమా మొదటి ఆటకే భారీ గా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు నేషనల్ హాలిడే అవ్వడం తో కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కానీ తర్వాత రోజు నుండి కలెక్షన్స్ క్రమంగా తగ్గాయి.

ఇక ఇప్పుడు మొత్తం మీద సినిమా 5 రోజుల్లో టోటల్ ఇండియా లో 130 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 165 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక టోటల్ ఓవర్సీస్ గ్రాస్ సుమారు 41 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

దాంతో 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 206 కోట్ల రేంజ్ లో ఉందని చెబుతున్నారు. కానీ సినిమా బడ్జెట్ 300 కోట్లు, అమ్మింది కూడా 320 కోట్ల రేంజ్ లో కానీ….శాటిలైట్ రైట్స్, ఇతర హక్కుల ద్వారా బాగానే రికవరీ అయినా పెట్టిన బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ చూసి ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అవుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here