Home న్యూస్ జనాలు రావట్లేదని గోల…మళ్ళీ అదే తప్పు చేస్తారు…ఏంటో ఇది!!

జనాలు రావట్లేదని గోల…మళ్ళీ అదే తప్పు చేస్తారు…ఏంటో ఇది!!

0

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ కుదిరితే ఏడాదికి 2 సినిమాలు లేదా ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేవాళ్ళు, మీడియం రేంజ్ హీరోలు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేశారు… కానీ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మోజులో ఒక్కో సినిమాను ఆలస్యం చేస్తూ ఎప్పుడు వస్తారో కూడా తెలియని గందరగోళం నెలకొంది….

మరో పక్క సమ్మర్ లాంటి బిగ్ సీజన్ లో సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి….నిర్మాతలు, సినిమా వాళ్ళు జనాలు థియేటర్స్ కి రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నా సరైన సినిమాలను రిలీజ్ చేయడమే లేదు. మరో పక్క రిలీజ్ అయ్యే సినిమాకి…

కొంచం బజ్ ఉంటే చాలు ఇక టికెట్ హైక్స్ ని పెంచేసి ఆడియన్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని థియేటర్స్ కి వచ్చేలా చేస్తున్నారు. టాప్ స్టార్స్ సినిమాలు అంటే ఏమో అనుకోవచ్చు. ఈ ఇయర్ కొన్ని మీడియం రేంజ్ మూవీస్ సైతం టికెట్ హైక్స్ లేకుండా థియేటర్స్ కి రాలేదు.

తండేల్, మ్యాడ్2, హిట్3 లాంటి సినిమాలు టికెట్ హైక్స్ ని ఆంధ్రలో పెంచుకుని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఇదే కోవలోకి కుబేర(Kuberaa Movie) కూడా చేరింది. సినిమా మీద కొంచం బజ్ ఉంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా జోరు చూపించాల్సి ఉండగా….

మరో పక్క నిర్మాతలు ఆంధ్రలో సినిమాకి ఏకంగా 75 రూపాయల టికెట్ హైక్స్ ని పెంచుకున్నారు….ఒక పక్క జనాలు థియేటర్స్ కి రావడం లేదు అంటూ గోల చేస్తూ మరో పక్క వచ్చే అవకాశం ఉన్న సినిమాలకు ఇలా టికెట్ హైక్స్ ని పెంచేసి రావాలా వద్ద అన్న డౌట్ లో ఆడియన్స్ ఉండేలా చేస్తున్నారు.

దాంతో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ జస్ట్ ఓపెనింగ్స్ కోసం చూసుకుంటున్నారు కానీ అదే టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఈ టికెట్ హైక్స్ మొదటి విలన్ గా మారే అవకాశం ఉంది అన్నది మాత్రం మారుస్తున్నారు. ఇక కుబేర ఈ టికెట్ హైక్స్ హెల్ప్ తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here