Home TRP రేటింగ్ తిప్పరా మీసం…రన్…ఫస్ట్ టైం TRP రిపోర్ట్స్…ఇంత తక్కువా??

తిప్పరా మీసం…రన్…ఫస్ట్ టైం TRP రిపోర్ట్స్…ఇంత తక్కువా??

451
0

 లాక్ డౌన్ తీయడం తో జనాలు బయట పనులతో బిజీ అయ్యారు, దాంతో టెలివిజన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గింది, దాంతో ఇది వరకు లా ప్రతీ వారం భారీ సంఖ్య లో సినిమా TRP రేటింగ్ లెక్కలు రిలీజ్ అవ్వడం లేదు… ఉన్నంతలో లాస్ట్ వీక్ 2 కొత్త సినిమా లు మొదటి సారిగా టెలికాస్ట్ అయ్యాయి… కాగా రెండు సినిమా లు కూడా పెద్దగా ఆకట్టుకుంటే TRP రేటింగ్ ని అందుకోలేదు.

ముందుగా శ్రీ విష్ణు నటించిన తిప్పరా మీసం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇక టెలివిజన్ లో కూడా పెద్దగా మెప్పించలేక పోయిన ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో…

2.88 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని టెలివిజన్ లో కూడా డిసాస్టర్ అయ్యింది. ఇక ఇదే సమయం లో సందీప్ కిషన్ నటించిన రన్ మూవీ కూడా టెలికాస్ట్ అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ రిజల్ట్ నే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది… ఇక టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా…

మొదటి సారికి గాను రన్ సినిమా కి 2.7 TRP రేటింగ్ మాత్రమె దక్కింది. దాంతో ఈ సినిమా కూడా టెలివిజన్ లో భారీగా నిరాశ పరిచినట్లు అయింది. ఇక ఇదే సమయం లో రెండేళ్ళ క్రితం వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను కి రెండు కొత్త సినిమాల కన్నా బెటర్ TRP రేటింగ్ దక్కడం విశేషం…

ఈ సినిమా కి 3.65 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం. దాంతో కొత్త సినిమాల కన్నా పాత సినిమాకే బెటర్ TRP రేటింగ్ వచ్చింది. ఇక మిగిలిన సినిమాలు ఏవి కూడా ఈ లిస్టులో ఎంటర్ అయ్యే రేంజ్ లో TRP రేటింగ్ ని సొంతం చేసుకోలేదు. ఇక ఈ వారం టెలికాస్ట్ అయ్యే సినిమాల TRP రేటింగ్ లు ఎలా ఉంటాయో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here