బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao Movie) రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా రిలీజ్ అయ్యి లెంత్ మరీ ఎక్కువ అవ్వడం ఇంపాక్ట్ ని చూపించి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత దసరా సెలవుల్లో…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా తర్వాత సినిమాను ట్రిమ్ చేయగా టాక్ కొంచం బెటర్ అయినా అప్పటికీ మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం ఇంపాక్ట్ చూపించి కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో అంచనాలను అందుకోలేక పోయింది. ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా…
ఎక్కువ అవ్వడంతో ఆ టార్గెట్ ను అందుకోవడంలో సినిమా విఫలం అయ్యింది అనే చెప్పాలి. 38.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టైగర్ నాగేశ్వరరావు సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
Tiger Nageswara Rao Total WW Collections Report
👉Nizam: 7.84Cr
👉Ceeded: 4.00Cr
👉UA: 2.59Cr
👉East: 1.57Cr
👉West: 1.01Cr
👉Guntur: 2.02Cr
👉Krishna: 1.35Cr
👉Nellore: 87L
AP-TG Total:- 21.25CR(37.00CR~ Gross)
👉KA+ROI: 2.25Cr
👉OS: 2.00Cr~
Total WW Collections – 25.50CR(48.00CR~ Gross)
(66%~ Recovery)
38.50 కోట్ల టార్గెట్ కి సినిమా 66% వరకు రికవరీని మాత్రమే సొంతం చేసుకుని టోటల్ గా 13 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక రవితేజ వచ్చే ఈగిల్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.