టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉండటం సినిమా కలెక్షన్స్ ఆ రేంజ్ దరిదాపుల్లో కి కూడా వెళ్ళేలా లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కష్టాలు పడాల్సిన అవసరం నెలకొంది ఈ సినిమా విషయం లో….
కాగా సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేయగా భారీ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేసే అవకాశాలు ఇప్పుడు కనిపించక పోవడంతో సెకెండ్ వీకెండ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లతో టీం మీట్ అయ్యి నష్టాలను కవర్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుండగా….
ఓవరాల్ గా నష్టాలను కవర్ చేయాలి అంటే సినిమా డిజిటల్ రిలీజ్ ను త్వరగా చేయాలనీ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది…. చిరు నటించిన ప్రీవియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి డిజిటల్ లో కూడా సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను అందుకోవడం, రామ్ చరణ్ నటించిన ఫ్లాఫ్ మూవీ వినయ విదేయ రామ సైతం…
డిజిటల్ లో సెన్సేషనల్ వ్యూస్ ని అందుకోవడంతో ఆచార్య డిజిటల్ రైట్స్ కి మంచి గిరాకీ సొంతం అయ్యింది. ఆల్ మోస్ట్ 12 కోట్ల రేంజ్ లో డిజిటల్ రైట్స్ అమ్ముడు పోగా సినిమాను ముందు నాలుగు వారాల క్లాజ్ మీద డిజిటల్ లో రిలీజ్ చేయాలని భావించినా ఇప్పుడు సినిమా పరిస్థితి చూసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో 2 లేదా మూడు వారాల లోపే సినిమా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ఒప్పుకుని….
ఆల్ మోస్ట్ 18 కోట్ల రేంజ్ లో డీల్ ని ఫైనల్ చేశారని సమాచారం. ఈ రేటు తో పాటు తీసుకున్న బిజినెస్ లో కొంత వరకు అమౌంట్ ని త్వరలో జరిగే మీటింగ్ లో సినిమాను కొన్న వాళ్ళకి తిరిగి ఇచ్చే పనిలో టీం ఉన్నట్లు తెలుస్తుంది…. త్వరలోనే దీని పై మరింత సమాచారం బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు సినిమా ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.