Home న్యూస్ టాలీవుడ్ లో 2020…5 నెలల్లో టాప్ 5 హిట్స్ ఇవే!!

టాలీవుడ్ లో 2020…5 నెలల్లో టాప్ 5 హిట్స్ ఇవే!!

870
0

2020 ఇయర్ చాలా బాగా మొదలైంది టాలీవుడ్ కి, సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాయి, తర్వాత ఫిబ్రవరి లో కూడా 2 సినిమాలు మెప్పించాయి… ఇక మార్చ్ నెలలో పెద్దగా స్ట్రైట్ మూవీస్ రిలీజ్ అవ్వలేదు కానీ ఓ డబ్ మూవీస్ స్లో గా స్టార్ అయ్యి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న టైం లో లాక్ డౌన్ మొదలై తర్వాత పూర్తిగా అన్నీ ఆగిపోయాయి.

ఒకసారి ఇప్పటివరకు టాలీవుడ్ లో 2020 లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ విషయానికి వస్తే ముందుగా టాప్ 5 ప్లేస్ లో డబ్ మూవీ కనులు కనులను దోచాయంటే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మొదట్లో ఆల్ మోస్ట్ థియేటర్స్ నుండి వెళ్లి పోయి మళ్ళీ జోరు చూపి హిట్ గా నిలిచింది.

Hit Movie Total World Wide Collections!

ఇక 4 వ ప్లేస్ లో విశ్వక్ సేన్ నటించిన హిట్ మూవీ భారీ పోటి లో కూడా టార్గెట్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది, కొత్త పాత సినిమాల పోటి అండ్ అన్ సీజన్ ఎఫెక్ట్ ఉన్నా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా సినిమా హిట్ అవ్వడం విశేషం.

Bheeshma Total WorldWide Collections

ఇక మూడో ప్లేస్ లో యూత్ స్టార్ నితిన్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ భీష్మ నిలిచింది, అ ఆ తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ భీష్మ తో గ్యారెంటీ హిట్ కొడతాడు అని అనుకున్న ఫిబ్రవరి లో రిలీజ్ అవ్వడం కొద్దిగా ఎఫెక్ట్ చూపినా కానీ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చాడు నితిన్.

Sarileru Neekevvaru Total WW Collections!!

ఇక రెండో ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సాలిడ్ కాంపిటీషన్ లో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము లేపే విజయాన్ని నమోదు చేసుకుని సంచలనం సృష్టించింది. దాంతో టాప్ 2 ప్లేస్ ని అందుకుంది.

Ala Vaikunthapurramuloo Total WW Collections

ఇక టాప్ ప్లేస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో తీవ్ర పోటి లో కూడా ఊహకందని కలెక్షన్స్ ని అందుకుని టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులతో పాటు కొన్ని రోజులు బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేసి సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది.

Top 10 Telugu Trailer Records In 24 Hrs

ఇవి మాత్రమె ఈ ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ మార్క్ ని అందుకోగలిగాయి, మార్చ్ నుండి కొత్త సినిమాలు ఏవి లేకపోవడం ఇదే పరిస్థితి ఆగస్టు దాకా ఉండేలా కనిపిస్తుండటంతో మళ్ళీ ఆడియన్స్ కొత్త సినిమాలు థియేటర్స్ లో చూడాలి అంటే మరికొంత కాలం ఆగక తప్పదు అనే చెప్పాలి.

Top 10 most Liked Telugu Trailers in 24hrs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here