బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాల్ఫ్ తో పోల్చితే ఈ ఇయర్ ఫస్ట్ హాల్ఫ్ లో హిట్స్ చాలా తక్కువే సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం కూడా మరీ అంత అనుకున్న రేంజ్ లో ఏమి లేదనే చెప్పాలి. హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు నిరాశ పరుస్తూ ఉండగా లాస్ట్ టాలీవుడ్ హిట్ వచ్చి ఆల్ మోస్ట్ నెలకి పైగానే టైం అవుతుంది ఇప్పుడు…
జూన్ స్టార్టింగ్ లో వచ్చిన మేజర్ మూవీ లాస్ట్ టాలీవుడ్ హిట్ కాగా తర్వాత వచ్చిన ఎ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. దాంతో ఇక ఇప్పుడు ట్రేడ్ లో అండ్ ఆడియన్స్ లో కూడా బజ్ ఉన్న సినిమా అయిన రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ పైనే…
ఆశలు అన్నీ నెలకొన్నాయి ఇప్పుడు… ఈ సినిమా మాత్రమే జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించే అవకాశం ఉన్న సినిమాగా కనిపిస్తూ ఉండగా ఈ సినిమా రిలీజ్ టైం కి నెలన్నరగా ఒక్క హిట్ లేని టాలీవుడ్ ఈ సినిమా పైనే పెట్టుకుంది ఇప్పుడు. ఇక రామ్ అందరి అంచనాలను ఎంతవరకు నిజం చేస్తాడో చూడాలి.