Home న్యూస్ టాలీవుడ్ అప్ కమింగ్ సీక్వెల్ మూవీస్ లిస్టు ఇదే!!

టాలీవుడ్ అప్ కమింగ్ సీక్వెల్ మూవీస్ లిస్టు ఇదే!!

866
0

టాలీవుడ్ కి సీక్వెల్స్ అస్సలు కలిసి రావు అంటారు, అది చాలా వరకు ప్రూవ్ అయ్యింది కూడా. టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ గా మిగిలి పోయాయి. బాహుబలి పార్ట్ 2 సీక్వెల్ కాని సీక్వెల్ అని చెప్పాలి. సినిమా అంతా ఒకే పార్ట్ అవ్వడం అందులో మొదటి భాగం ఒక పార్ట్ అలాగే రెండో భాగం రెండో పార్ట్ గా చెప్పడంతో…

Tollywood Highest Tweeted First Looks In 24 Hours

ఆ సినిమా ను కంప్లీట్ సీక్వెల్ అని చెప్పలేం కానీ పార్ట్ 2 అని పెట్టారు కాబట్టి సీక్వెల్ కాని సీక్వెల్ గా చెప్పొచ్చు. ఇక ఆ సినిమా ను పక్కకు పెడితే రానున్న టైం లో టాలీవుడ్ లో కొన్ని సినిమాల సీక్వెల్స్ కన్ఫాం అవ్వగా కొన్ని కన్ఫాం అయ్యే స్టేజ్ లో ఉన్నాయి… ఒక్కొటిగా అవి పరిశీలిస్తే…

కార్తికేయ 2:
2014 లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు రెండో పార్ట్ ఈ పాటికే మొదలు అయ్యి లోగో టీసర్ లాంచ్ అవ్వగా లాక్ డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ ని జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

ఎఫ్ 3:
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్ రాబోతుంది అన్నది అందరికీ తెలిసిందే, కానీ ఈ ఇయర్ మొదలు అవ్వాల్సిన సినిమా వచ్చే ఇయర్ లో మొదలు కానుంది…. 2022 సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు రాబోచ్చు.

ఢీ 2:
శ్రీనువైట్ల కెరీర్ టర్నింగ్ పాయింట్స్ లో ముందు నిలిచే ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఈ సినిమా ఫార్మాట్ లోనే సినిమాలు చేశారు. ప్రస్తుతం కంప్లీట్ గా ఫాం కోల్పోయిన శ్రీనువైట్ల మళ్ళీ ఈ సినిమా సీక్వెల్ తో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. ఈ ఇయర్ ఎండ్ లో సెట్స్ పైకి వెళుతున్న సీక్వెల్ వచ్చే ఇయర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఆదిత్య999:
బాలకృష్ణ కెరీర్ లో ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ లో ముందు నిలిచే ఆదిత్య 369 సినిమా కి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు బాలయ్య. ప్రస్తుతం మొదలు పెట్టాలని గట్టిగానే భావిస్తున్నాడు కానీ వచ్చే ఇయర్ సీక్వెల్ మొదలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, కానీ ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫాం కాలేదు.

ఇస్మార్ట్ శంకర్2:
రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కి సీక్వెల్ ఉందని రామ్ ఎప్పుడో అనౌన్స్ చేశాడు, ప్రస్తుతం స్రిప్ట్ వర్క్ జరుగుతుండగా పూరీ అండ్ రామ్ ఫ్రీ అయిన వెంటనే ఈ సీక్వెల్ మొదలు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఇయర్ ఎండ్ లేదా 2022 లో సినిమా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Top 10 most Liked Telugu Trailers in 24hrs

ఇవి మొత్తం మీద త్వరలో టాలీవుడ్ లో రూపొందడానికి సిద్ధంగా ఉన్న సీక్వెల్ సినిమాలు. ఇందులో అన్నీ మొదలు అవుతాయో లేదో తెలియదు కానీ మూడు నాలుగు పక్కాగా స్టార్ అయ్యే అవకాశం ఉంది, ఇక సినిమాల రిజల్ట్ లు ఎలా ఉంటాయి అన్నది మాత్రం చెప్పలేం…

Top 10 Telugu Trailer Records In 24 Hrs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here