బయోపిక్ మూవీస్ లో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆ బయోపిక్ సిరీస్ లో ఆడియన్స్ ను ఊహకందని రేంజ్ లో మెప్పించిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా “భాగ్ మిల్కా భాగ్”… ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యి ఏ అంచనాలు లేకుండానే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా ఇది…
అలాంటి ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ సోలో హీరోగా అప్పుడప్పుడు ట్రై చేసినా సక్సెస్ సొంతం కాలేదు, అలాగే ఈ సినిమా డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా కూడా ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ సొంతం అవ్వలేదు, దాంతో తిరిగి వీళ్ళ కాంబినేషన్ లోనే రీసెంట్ గా…
తూఫాన్ అనే బాక్సింగ్ నేపధ్యంలో కొత్త సినిమాను తెరకేక్కించగా థియేటర్స్ లో రిలీజ్ ను సమ్మర్ లో ప్లాన్ చేయగా ఈ సినిమా తో జనాలు థియేటర్స్ కి వస్తారు అనుకున్నా సెకెండ్ వేవ్ వలన సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా చేశారు.
వీళ్ళ కాంబినేషన్ మీద నమ్మకంతో భారీ రేటే పెట్టి సినిమాను కొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. కానీ సినిమా ఫైనల్ గా రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్ అనిపించే టాక్ ని మాత్రమే సొంతం చేసుకోగా ఫర్హాన్ అక్తర్ పెర్ఫార్మెన్స్ కి మంచి పేరే వస్తున్నా కానీ సినిమా పరంగా భాగ్ మిల్కా భాగ్ తో పోల్చితే…
మినిమం ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది ఈ సినిమా అంటున్నారు ఇప్పుడు… దాంతో ఇద్దరూ ఎవరికీ వాళ్ళ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నా ఇద్దరూ కలిసి తిరిగి కంబ్యాక్ చేయాలి అనుకున్నా కానీ ఈ సినిమా రిజల్ట్ ఇద్దరికీ దెబ్బ కొట్టినట్లు అయింది అంటూ ఇప్పుడు బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.