Home TRP రేటింగ్ కన్నడ గడ్డపై టాప్ 2 TRP రేటింగ్ కొట్టిన రంగస్థలం!!

కన్నడ గడ్డపై టాప్ 2 TRP రేటింగ్ కొట్టిన రంగస్థలం!!

689
0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ రంగస్థలం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం ఏ సినిమా సృష్టించిన రికార్డులు ఇలాంటివో అందరికీ తెలిసిందే, సెన్సేషనల్ కలెక్షన్స్ తో 127.5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి టాలీవుడ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత లేట్ గా ఇతర భాషల్లో డబ్ అయిన విషయం తెలిసిందే.

లేట్ రిలీజ్ వలన బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా రీసెంట్ గా కన్నడ డబ్ వర్షన్ టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. నాన్ కన్నడ మూవీస్ లో టాలీవుడ్ తరుపున ఆల్ టైం సెకెండ్ బెస్ట్ TRP రేటింగ్ ని…

సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా. ఇది వరకు అక్కడ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి 6.3 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రంగస్థలం సినిమా కన్నడ వర్షన్ కి 6.02 TRP రేటింగ్ దక్కింది.

ఇక వ్యూవర్ షిప్ ఇంప్రెషన్స్ విషయానికి వస్తే…సైరా కి 4,095,000 దక్కగా…రంగస్థలం కి మాత్రం 4,149,000 ఎక్కువ ఇంప్రెషన్స్ దక్కాయి. ఇక సౌత్ నుండి కన్నడ డబ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో కూడా రంగస్థలం సినిమా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని దక్కించు కోవడం విశేషం అనే చెప్పాలి.

ఒక సారి అక్కడ హైయెస్ట్ ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకున్న టాప్ సౌత్ మూవీస్ ని గమనిస్తే
1. #Viswasam :- 5053000 imp
2. #Bigil :- 4535000 imp
3. #Rangasthalam :* 4149000 imp
4. #SyeRaaNaraSimhaReddy :- 4,095,000 imp
5. #Bigil :- 3835000 imp
ఇవీ మొత్తం మీద కన్నడ లో హైయెస్ట్ ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకున్న సౌత్ డబ్బింగ్ మూవీస్. మొత్తం మీద రంగస్థలం రెండేళ్ళ తర్వాత అక్కడ టెలికాస్ట్ అయినా కానీ అల్టిమేట్ TRP రేటింగ్ తో దుమ్ము దుమారం చేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here