Home టోటల్ కలెక్షన్స్ రాజావారు రాణిగారు కలెక్షన్స్: అమ్మింది 1.50 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

రాజావారు రాణిగారు కలెక్షన్స్: అమ్మింది 1.50 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

1554
0

     బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా ఫ్లాఫ్ అవుతాయి, కొన్ని ఫ్లాఫ్ టాక్ తో కూడా హిట్లు గా నిలుస్తాయి. ఇక ఎబో యావరేజ్ రేంజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అప్పుడప్పుడు హిట్ గీత ని అందుకోగా కొన్ని సినిమాలు ఫ్లాఫ్ గా మిగిలి పోతాయి. ఇప్పుడు ఈ కోవ లోకే వచ్చే కొత్త సినిమా రాజావారు రాణిగారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకున్నా సెకెండ్ ఆఫ్ అనుకున్న రేంజ్ లో లేకపోవడం తో ఉన్నంతలో ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన కూడా అనుకున్న రేంజ్ లో ఏమి లేదు.

టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ సినిమా కి ఏమాత్రం ఓపెనింగ్స్ కానీ తర్వాత లాంగ్ రన్ లో మినిమం కలెక్షన్స్ కూడా దక్కలేదు. దాంతో ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 81 లక్షల రేంజ్ షేర్ ని అందుకుని పరుగు ను ముగించి ఫ్లాఫ్ అయ్యింది.

ఒకసారి ఫైనల్ రన్ ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 1.5Cr~
?Break Even: 1.80cr
?AP TG Total Share: 0.59Cr
?Total WW Share: 0.81cr
?Total Gross: 1.42Cr
?Total Loss: 0.69Cr Loss From Business
?Movie Verdict: (F-L-O-P)
ఇదీ మొత్తం మీద రాజావారు రాణిగారు సినిమా ఫైనల్ కలెక్షన్స్ అప్ డేట్.

సినిమా బిజినెస్ 1.5 కోట్లు కాగా సినిమా టోటల్ రన్ పూర్తీ అయ్యే సరికి అందులో 81 లక్షల షేర్ ని మాత్రమె రికవరీ చేసి 69 లక్షల మేర నష్టాన్ని సొంతం చేసుకుని ఓవరాల్ గా ఫ్లాఫ్ గా పరుగును ముగించింది. దాంతో మరోసారి ఎబో యావరేజ్ అనిపించుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here