Home న్యూస్ హరిహర వీరమల్లు సినిమాలో ఎన్ని VFX షాట్స్ ఉన్నాయో తెలుసా!!

హరిహర వీరమల్లు సినిమాలో ఎన్ని VFX షాట్స్ ఉన్నాయో తెలుసా!!

0

చాలా టైంగా ఆడియన్స్ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నా ఎదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అవ్వాల్సి వస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా రీసెంట్ గా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి జులై రెండో వారం లేదా చివరి వారంలో…

ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ చాలా హైప్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతున్నాడు…. సినిమాలో గ్రాఫిక్స్ హంగులు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతూ ఉండగా….ఇండియన్ సినిమా లోనే…

వన్ ఆఫ్ ది హైయెస్ట్ VFX షాట్స్ ఈ సినిమా కోసం వాడారని అందుకే సరైన ఔట్ పుట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇవన్నీ ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే అన్ని లెక్కలు మారిపోవడం ఖాయమని చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

ఇండియన్ మూవీస్ లో అత్యధిక VFX షాట్స్ వాడిన మూవీ గా ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు నిలుస్తాయి…8 వేలకు పైగా VFX షాట్స్ ను ఈ సినిమాల కోసం వాడినట్లు సమాచారం, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా అందరి అంచనాలను మించుతూ…

ఏకంగా 6 వేలకు పైగా VFX షాట్స్ ను వాడారట. అంతలా వాడెంత ఈ సినిమాలో ఏముందో అన్నది సినిమా ట్రైలర్ తో తెలుస్తుంది అని అంటున్నారు…ఒక్క క్లైమాక్స్ కోసమే పాతిక కోట్లకు పైగా ఖర్చు చేశారని చెబుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కూడా పవన్ కళ్యాణ్…

కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 335 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అంటున్నారు…అందులో పార్ట్ 2 ఫూటేజ్ కూడా ఉందని తెలుస్తూ ఉండగా…ఇంత భారీగా ఖర్చు చేసిన హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుండగా…అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here