మూడేళ్ళ తర్వాత వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్, సమ్మర్ కానుకగా సాలిడ్ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ రీమేక్ మూవీ పై ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా రిలీజ్ రోజు టైం లో ఆంధ్రాలో అనేక అవరోధాలను ఎదురుకోవడం మొదలు పెట్టిన ఈ సినిమా తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ కి చేరడం తో మరింత…
ఇబ్బందులను ఎదురుకోగా రిలీజ్ అయిన మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ ను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే పూర్తీ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ డే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే, లేదా మార్చ్ లో నైనా రిలీజ్ అయ్యి ఉంటే…
కచ్చితంగా సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క మరో విధంగా ఉండేది, ఓవరాల్ గా రీసెంట్ టైం లో ఒక పెద్ద సినిమా ఇన్ని ఇబ్బందులు ఎదురుకోవడం ఈ సినిమా విషయం లోనే జరిగింది, అయినా కానీ ఇవన్నీ తట్టుకుని 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా చాలా క్లోజ్ గా వచ్చింది అనే చెప్పాలి.
సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 25.06Cr (inc.GST)
👉Ceeded: 12.92Cr
👉UA: 11.73Cr (inc.GST)
👉East: 6.50Cr (inc.GST)
👉West: 7.02Cr (inc.GST)
👉Guntur: 7.13Cr (inc.GST)
👉Krishna: 5.02Cr (inc.GST)
👉Nellore: 3.39Cr
AP-TG Total:- 78.77CR (121.65Cr Gross~)
KA+ROI – 3.67Cr (Corrected)
OS- 3.92Cr (Corrected)
Total WW: 86.36CR(138.20CR~ Gross)(96% Recovery)
మొత్తం మీద 89.35 కోట్ల బిజినెస్ కి 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ తర్వాత 3.64 కోట్ల నష్టం సొంతం చేసుకోగా… 96% రికవరీ ని దక్కించుకుని ఓవరాల్ గా సెమీ హిట్ గా పరుగును ముగించింది. సినిమా కి మరో ఒక్క రోజు హాలిడే మొదటి వీక్ లో, లేదా తొలిరోజు ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని ఉండేది ఈ సినిమా.