బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాడు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న అల్లరోడు, తర్వాత మళ్ళీ అలాంటి విజయం కాదుకదా నార్మల్ విజయం సొంతం చేసుకుందామని ట్రై చేసినా కానీ ఏమాత్రం సక్సెస్ అవ్వలేక తన మార్కెట్ ని కూడా భారీగా కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు. తన లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమానే అయినా కానీ అనేక కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును చాలా త్వరగానే ముగించింది.
టాక్ కానీ సినిమా ఓపెనింగ్స్ కానీ ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోవడం తో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్ట లేక పోయిన ఈ సినిమా టోటల్ రన్ లో భారీ నష్టాలనే మిగిలించి అల్లరి నరేష్ ఖాతాలో మరో డిసాస్టర్ మూవీ గా నిలిచి అల్లరి నరేష్ హిట్ వేటని కొనసాగేలా చేసింది.
ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 57L
👉Ceeded: 32L
👉UA: 27L
👉East: 17L
👉West: 12L
👉Guntur: 16L
👉Krishna: 14L
👉Nellore: 9L
AP-TG Total:- 1.84CR (2.70Cr Gross~)
KA+ROI: 7L
OS: 4L
Total:- 1.95Cr(3.25Cr~ Gross)
మినిమమ్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. సినిమాను మొత్తం మీద 3.2 కోట్ల రేంజ్ రేటు కి టోటల్ గా అమ్మగా సినిమా 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా…
టోటల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా మొత్తం మీద 1.55 కోట్ల రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును ముగించింది, సంక్రాంతి సెలవుల్లో రిలీజ్ అయినా ఇంకా బెటర్ కలేక్షన్స్ ని సాధించేదేమో కానీ సోలోగా వచ్చి ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా..