Home న్యూస్ టోవినో థామస్ ARM మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

టోవినో థామస్ ARM మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

స్ట్రైట్ తెలుగు సినిమాలతో కాక పోయినా, ఓటిటి హిట్ మిన్నల్ మురళి, థియేట్రికల్ డబ్ హిట్ 2018 లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడే అయిన టోవినో థామస్ కెరీర్ లో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన లేటెస్ట్ మూవీ ARM సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే ఇది మూడు జనరేశషన్స్ కి సంభందించిన హీరో కథ, మొదటి జనరేషన్ హీరో శత్రువులతో పోరాడి ఎంతో పేరు సొంతం చేసుకున్న యోదుడు అయితే రెండో జనరేషన్ హీరో దొంగగా మార చరిత్రని భంగం కలిగిస్తాడు…ఇక మూడో జనరేషన్ హీరో మంచి వాడే అయినా తన వంశం పేరు చదిపోవడంతో…

ఊర్లో ఏం దొంగతనం జరిగినా అది హీరో మీదకు వస్తుంది. ఇలాంటి క్రమంలో హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి ఆ తర్వాత కథ ఏం అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద కథ పాయింట్ పరంగా యూనిక్ గానే అనిపించినా కూడా తెరకెక్కించిన విధానం చాలా నెమ్మదిగా సాగుతుంది..

ముఖ్యంగా ఫస్టాఫ్ కథ నత్తనడకన సాగి ఒక దశ లో తెగ బోర్ కొట్టిస్తుంది, దానికి తోడూ నేటివిటీ కూడా ప్రతికూలంగా మారింది అని చెప్పొచ్చు మనకు….ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించగా ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా అనిపిస్తుంది…

టోవినో థామస్ మూడు రోల్స్ తో అదరగొట్టేశాడు….హీరోయిజం ఎలివేట్ సీన్స్, కళరీ విద్యతో చేసిన సీన్స్ బాగున్నాయి…కృతి శెట్టి పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ కూడా తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించాయి. సంగీతం యావరేజ్ గా ఉంది, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే…

VFX యావరేజ్ గా ఉండగా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ సినిమా కి మేజర్ మైనస్ పాయింట్స్…మంచి పాయింట్ నే ఎంచుకున్నా కూడా చెప్పిన విధానం మాత్రం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…సీన్ వైజ్ కొన్ని చోట్ల బాగున్నా కూడా చాలా చోట్ల సహనానికి పరీక్ష పెడుతుంది సినిమా…

ఓవరాల్ గా సినిమా పూర్తి అయ్యే టైంకి ఆడియన్స్ కి యావరేజ్ లెవల్ లో అనిపించడానికి కూడా చాలా ఓపికతో సినిమా చూడాల్సిన అవసరం ఉంటుంది..కానీ రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కొంచం డిఫెరెంట్ జానర్ మూవీస్ చూడాలి అనుకుంటే ఈ సినిమా కొంచం కష్టపడి చూస్తె సీన్ వైజ్ అక్కడక్కడా కొంచం మెప్పించవచ్చు. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here