Home న్యూస్ ట్రాన్స్ ఫార్మర్స్-రైజ్ ఆఫ్ ది బీస్ట్ టాక్ ఏంటి…సినిమా ఎలా ఉందంటే!!

ట్రాన్స్ ఫార్మర్స్-రైజ్ ఆఫ్ ది బీస్ట్ టాక్ ఏంటి…సినిమా ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ట్రాన్స్ ఫార్మర్స్-రైజ్ ఆఫ్ ది బీస్ట్ టాక్(transformers rise of the beasts)….వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియాలో కూడా రిలీజ్ అవ్వగా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… గ్రహాలను నాశనం చేసే విలన్స్ నుండి తమ గ్రహాన్ని కాపాడుకోవడానికి మాగ్జిమల్స్ అనే ట్రాన్స్ ఫార్మర్స్ ఒక వస్తువుని విలన్స్ కి దొరకకుండా కాపాడే భాద్యత తీసుకుంటారు, అందుకుని భూమి మీద నివసించే వీళ్ళ కి తర్వాత ఆటో బాట్స్ అయిన మెయిన్ ట్రాన్స్ ఫార్మర్స్…

తమ గ్రహానికి వెళ్ళడానికి ఆ వస్తువు అవసరం ఉన్నప్పటికీ…ఈ వస్తువుని వాడి భూమిని సైతం నాశనం చేసే పనిలో విలన్స్ ఉంటారు…. మరి అప్పుడు ఆటో బాట్స్ మరియు మాగ్జిమల్స్ కలిసి ఏం చేశారు అన్నది సినిమా స్టొరీ లైన్…. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాలో స్టొరీ పాయింట్ చాలా నార్మల్ గానే ఉంటుంది…

ఇందులో కూడా కథ చాలా నార్మల్ గానే అనిపించినా కూడా ఆ గ్రాఫిక్స్, విజువల్స్, క్లైమాక్స్ ఫైట్ సీన్ చాలా బాగా మెప్పించడంతో ఈ సిరీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా కొంచం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా మెప్పిస్తుంది.

సెకెండ్ ఆఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో విజిల్స్ వేసే రేంజ్ లో కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడంతో ఓవరాల్ గా సినిమా అయ్యే టైంకి సినిమా బాగానే మెప్పించింది అనిపించేలా ముగుస్తుంది… ఈ సినిమా చూడాలి అంటే ప్రీవియస్ మూవీస్ చూసి తీరాలా అంటే పెద్దగా అవసరం లేదు కానీ…

ఆటో బాట్స్, మాగ్జిమల్స్ మరియు డిసెప్టికాన్స్ అంటే ఎవరెవరు లాంటివి తెలియాలి అంటే ఒకటి రెండు మూవీస్ చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే క్లియర్ గా అర్ధం అవుతుంది. కొత్తగా చూసే ఆడియన్స్ కొంచం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొంచం టైం తర్వాత వాళ్ళకి కూడా సినిమా బాగానే నచ్చుతుంది… ఓవరాల్ గా ఒకసారి ఈజీగా చూసేలా సినిమా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here