టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా సింహాద్రి(Simhadri), ఆది(aadi) తో యంగ్ ఏజ్ లోనే మాస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, తర్వాత ఆ క్రేజ్ ని అందుకునే సినిమా ఇవ్వలేదు, ఒకటి 2 ఫ్లాఫ్స్ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకుని సంచలనం సృష్టించింది, 26.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అప్పట్లో ఊరమాస్ రికార్డ్ ను నమోదు చేసింది.
ఇలాంటి సినిమా ముందుగా ఎన్టీఆర్ కి కాకుండా నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి వెళ్ళింది అన్న విషయం కొద్ది మందికే తెలుసు.. ఈ సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్నీ ఓపెన్ గానే చెప్పారు. కానీ బాలయ్య ఈ సినిమా ను ఎందుకని చేయాలేదు అనడానికి 2 రీజన్స్ ఉన్నాయి.
అందులో ఒకటి, అప్పటికే బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం ఇలా అన్నీ ఫాక్షన్ అండ్ రివెంజ్ మూవీస్ నే చేస్తూ వస్తున్నాడు, ఇలాంటి టైం లో మళ్ళీ ఈ కథ ఎందుకని లైట్ తీసుకున్నాడు అన్నది ఒక రీజన్…
మరో రీజన్ ఏంటి అంటే… ఈ కథ ఫస్ట్ విజయేంద్రప్రసాద్ రాజమౌళి డైరెక్షన్ కోసం రాయలేదు, బి గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య తో చేయాలని కథ రాశారు, కథ వినిపించాక ఓకే చెప్పే టైం లో పోసాని కృష్ణ మురళి పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథని తీసుకు రావడం తో ఆ కథ నచ్చి పైన చెప్పిన రీజన్ తో ఈ సినిమా ను పక్కకు పెట్టాడు బాలయ్య..
తర్వాత సినిమా కథ కోసం చూస్తున్న రాజమౌళి కి ఈ కథ చెప్పగా దాన్ని కొద్దిగా మార్చి ఎన్టీఆర్ కి సూట్ అయ్యేలా డిసైన్ చేసి తెరకెక్కించారు… ఇలా బాలయ్య చేయాల్సిన సినిమా ఎన్టీఆర్ కి దక్కింది, మొత్తం మీద ఇది సింహాద్రి ఎన్టీఆర్ చేయడానికి ప్రధాన రీజన్…ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారింది సింహాద్రి సినిమా.. అదే టైం లో బాలయ్య కి పడి ఉన్నా సంచలనాలు సృష్టించేది కావొచ్చు..