Home న్యూస్ సోషల్ మీడియాలో పుష్ప2 ట్రోల్స్…..కానీ సీన్ రివర్స్!

సోషల్ మీడియాలో పుష్ప2 ట్రోల్స్…..కానీ సీన్ రివర్స్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు ఆగస్టు లో గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వద్నైకి సిద్ధం అవుతున్న సినిమా పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule Movie) మూవీ మీద హైప్ మరో లెవల్ లో ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను…

రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా టీసర్ కి ఓవరాల్ గా మరీ అంచనాలను మించి పోయే రీచ్ కాక పోయినా ఉన్నంతలో బాగానే జోరు చూపించింది. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ టీసర్ కి యూట్యూబ్ లో 39.36 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 1.25 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుంది….

కానీ ఇప్పుడు ఈ టీసర్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ పడుతున్నాయి…. వ్యూస్ విషయంలో ఫేక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు అంటూ ఓ రేంజ్ లో ఇతర ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి కారణం 24 గంటల్లో 39.36 మిలియన్ వ్యూస్ వస్తే రియల్ టైం వ్యూస్ మాత్రం ఏకంగా 85 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటూ…

మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు….చాలా వరకు ఏ యూట్యూబ్ అయినా కూడా ఏ రేంజ్ లో వ్యూస్ భారీగా జోరు చూపించినా కూడా అప్ డేట్ అయిన వ్యూస్ కన్నా మరీ ఇంత గ్యాప్ ఉండవు అంటూ ట్రోల్స్ గట్టిగానే పడ్డాయి, పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని గంటల పాటు కూడా టీసర్ కి 45 మిలియన్స్ రేంజ్ లోనే…

వ్యూస్ ఉండటం ఫేక్ పోస్టర్ ఫేక్ రికార్డ్ అంటూ ఓ రేంజ్ లో ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ చేయగా తర్వాత కొంత టైంకి టీసర్ ఎట్టకేలకు వ్యూస్ అప్ డేట్ అయ్యాయి… 85 మిలియన్ వ్యూస్ మార్క్ ని టీసర్ క్రాస్ చేసి ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం..

మొత్తం మీద అనుకున్న టైంకి టీసర్ వ్యూస్ గ్లిట్చ్ లాంటివి లేకుండా అప్ డేట్ అయ్యి ఉంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను నమోదు చేసుకుని ఉండేది, కానీ వ్యూస్ అనుకున్న టైంకి అప్ డేట్ అవ్వక పోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురి అయినా కానీ వ్యూస్ అప్ డేట్ అవ్వడంతో అంతా నార్మల్ అయ్యిందని చెప్పొచ్చు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here