Home న్యూస్ ఓరినీ ఈ ట్రోల్స్ ఏంటి సామి…ఆ సినిమాతో కంపేర్ చేసి రచ్చ చేస్తున్నారు!!

ఓరినీ ఈ ట్రోల్స్ ఏంటి సామి…ఆ సినిమాతో కంపేర్ చేసి రచ్చ చేస్తున్నారు!!

0

ఒకప్పటిలా ఒక పెద్ద సినిమా…క్రేజ్ ఉన్న సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా యునానిమస్ రెస్పాన్స్ రావడం అన్నది చాలా కష్టంగా మారిపోయింది రీసెంట్ టైంలో….చాలా రేర్ గానే పెద్ద సినిమాల అప్ డేట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)…

నటిస్తున్న బిగ్ హర్రర్ కామెడీ మూవీ అయిన ది రాజా సాబ్(The Raja Saab Movie) నుండి ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు…దానికన్నా ముందు వింటేజ్ ప్రభాస్ మూవీస్ ను గుర్తు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా…

AI ని ఎక్కువగా వాడారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు…ఇక ప్రభాస్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రభాస్ ఓల్డ్ గెటప్ లుక్ షాకింగ్ గానే అనిపించినా అందరినీ సర్ప్రైజ్ చేసింది… కానీ సోషల్ మీడియాలో ఈ లుక్ మీద కంప్లీట్ గా నెగటివ్ రెస్పాన్స్ స్ప్రెడ్ అయింది…

ఆ లుక్ లో ప్రభాస్ గెటప్ ఓకే అనిపించినా క్లోజ్ అప్ లో ప్రభాస్ ఫేస్ లుక్ ని సరిగ్గా సెట్ చేయలేక పోయారని అంటూ ఉండగా, ఓవరాల్ గా ఈ గెటప్ ను ఇది వరకు వచ్చిన వెంకటేష్(venkatesh) నటించిన నాగవల్లి సినిమాలో ఉన్న ఓల్డ్ లుక్ ని పోలి ఉందని….ఆ సినిమాలో ఓల్డ్ గెటప్ క్రింజ్ లా అనిపించగా ఇప్పుడు ఈ గెటప్ కూడా అలానే ఉంది అంటూ…

ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు….లుక్ అదిరిపోతుంది అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అని టీం ఎక్స్ పెర్ట్ చేసినా కూడా వాళ్ళు అంచనాలు అన్నీ కూడా తలకిందలు అయ్యాయి సోషల్ మీడియాలో….తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక్కటి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ పై సోషల్ మీడియాలో అనుకున్నదానికి మించి ట్రోల్స్ పడగా,మేకర్స్ ఈ లుక్ మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్న నేపధ్యంలో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది…. ఇక సినిమా వచ్చాక ఈ లుక్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here