టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) భారీ అంచనాల నడుమ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా…
రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి సినిమాకి ఓవరాల్ గా రెస్పాన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా, అందరూ యునానిమస్ లెవల్ రెస్పాన్స్ ను టీసర్ నుండి ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అది జరగలేదు….టీసర్ క్వాలిటీ పరంగా విజువల్స్ పరంగా చూసుకుంటే…
అద్బుతంగా ఉండాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ బిలో పార్ అనిపించేలా ఉండటం, టీసర్ కట్ ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ టీసర్ లానే అనిపించడం, అలాగే కథ పాయింట్ కూడా టీసర్ వరకు పార్ట్ 1 మాదిరిగానే అనిపించడం లాంటివి ట్రోల్స్ కారణం అవ్వగా మరో పక్క…
సినిమా లో ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో చూపించి ఉంటారు అనుకుంటే టీసర్ కట్ వరకు ఫ్యాన్స్ కి ఓకే అనిపించినా కూడా సోషల్ మీడియాలో మెజారిటీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మాత్రం టీసర్ లో ఎన్టీఆర్ షాట్స్ కి మిక్సుడ్ రెస్పాన్స్ అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు..
ఎన్టీఆర్ లుక్ బాగున్నా కూడా షాట్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేవని ఎక్కువ ఎలివేషన్ లు హృతిక్ కే పెట్టినట్లు అనిపించింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. ఓవరాల్ గా వార్2 టీసర్ రొటీన్ స్పై యూనివర్స్ లో ఒకటిలానే అనిపించేలా ఉందంటూ…
ప్రస్తుతానికి ట్రోల్స్ పడుతూ ఉండగా మరో పక్క ఎన్టీఆర్ నుండి కామన్ ఆడియన్స్ ఇంకా ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేశారు కానీ టీసర్ ఆ రేంజ్ ను అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఇక మేకర్స్ ట్రైలర్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని సాలిడ్ కట్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఓవరాల్ గా….