Home TRP రేటింగ్ 5 కోట్లకు అమ్మితే మజిలీ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

5 కోట్లకు అమ్మితే మజిలీ TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

0

     యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరియు సమంత ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మజిలీ ఈ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాగా సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 40 కోట్లకు పైగా షేర్ ని అందుకుని నాగ చైతన్య కెరీర్ లో మొట్టమొదటి 40 కోట్ల సినిమా గా నిలిచి డబుల్ బ్లాక్ బస్టర్ గా మారింది, అలాంటి సినిమా బుల్లి తెరపై టెలికాస్ట్ అంటే…

అందరి లోను కచ్చితంగా TRP రేటింగ్ ల పరంగా దుమ్ము లేపడటం ఖాయం అని అనుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీ మూవీ అవ్వడం తో కచ్చితంగా మినిమమ్ 15 కి తగ్గకుండా TRP రేటింగ్ వస్తుందని అంతా అనుకున్నారు, కానీ సినిమా కి మొత్తం మీద…

మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7.9 TRP రేటింగ్ దక్కింది, అది కేవలమ్ సిటీలకు మాత్రమె, అర్బన్ అండ్ రూరల్ ఏరియాలలో మొత్తం మీద 6.13 TRP రేటింగ్ మాత్రమె దక్కింది. ఇది కొన్ని పెద్ద సినిమాల కన్నా బెటర్ అయినా కానీ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అందరూ కొంచం ఎక్కువగా నే ఆశించారు.

ఇక ఈ సినిమా ను సుమారు 5 కోట్ల రేంజ్ డబ్బులు ఇచ్చి జెమినీ టివి వారు శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు, మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడే భారీ గా TRP రేటింగ్ సాధిస్తుంది అనుకున్నా TRP రేటింగ్ తక్కువగా ఉండటం తో మరో రెండు మూడు సార్లు టెలికాస్ట్ చేస్తేనే…

ఛానల్ కూడా సినిమా తో మంచి రెవెన్యూ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వెండితెర పై దుమ్ము లేపిన ఈ సినిమా బుల్లితెర పై మాత్రం ఒకింత షాక్ ఇచ్చే TRP రేటింగ్ నే సాధించింది అని చెప్పాలి. ఇక నాగచైతన్య అప్ కమింగ్ విక్టరీ వెంకటేష్ తో చేస్తున్న వెంకీ మామ ఈ అక్టోబర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here