నోటా TRP రేటింగ్…షాకింగ్

0
221

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో రూపొందిన మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ నే సొంతం చేసుకోగా అంచనాలను అందుకోలేక రెండు చోట్లా నిరాశనే మిగిలించి ఫ్లాఫ్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కొంత సమయం తర్వాత బుల్లి తెరపై రీసెంట్ గా టెలికాస్ట్ అయింది. మా టివి ఛానెల్ లో ఈ సినిమా టెలికాస్ట్ అవ్వగా…

సినిమా TRP రేటింగ్ నిరాశ పరిచింది అని చెప్పాలి. గీత గోవిందం సినిమా ఏకంగా 20.8 TRP రేటింగ్ ని అందుకోగా పూర్తీ గా పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ అండ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న నోటా సినిమా కి తొలిసారి TRP రేటింగ్ పరంగా 7.44 TRP రేటింగ్ దక్కిందని సమాచారం.

ఇది ఒకింత షాకింగ్ లో TRP రేటింగే అయినా కొన్ని పెద్ద హీరోల సినిమాల TRP రేటింగ్ లతో పోల్చితే బెటర్ అనే చెప్పాలి. అందునా పొలిటికల్ నేపధ్యం ఉన్న సినిమాలకు TRP రేటింగ్ పరంగా మరీ ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. మొత్తం మీద సినిమా వెండితెర అలాగే బుల్లితెర పై కూడా యావరేజ్ గానే నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!