Home న్యూస్ టక్ జగదీష్ బడ్జెట్…కంప్లీట్ బిజినెస్…లాభామా నష్టమా!!

టక్ జగదీష్ బడ్జెట్…కంప్లీట్ బిజినెస్…లాభామా నష్టమా!!

0

నాచురల్ స్టార్ నాని నుండి చాలా కాలం తర్వాత వస్తున్న నికార్సయిన కమర్షియల్ మూవీ లా అనిపించిన టక్ జగదీష్ సినిమా టీసర్ అంచనాలను పెంచింది కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా ఉండబోతుందని క్లియర్ చేశారు మేకర్స్… ఇక ట్రైలర్ లో కమర్షియల్ మాస్ టచ్ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు సినిమా పై అంచనాలు బాగానే మెయిన్ టైన్ అవుతున్నాయి అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కానుండగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ ఏంటి టోటల్ బిజినెస్ ఎంత వరకు జరిగింది, నిర్మాతలకు లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా లాంటి వివరాలు ఆసక్తిని రేపుతున్నాయి అని చెప్పాలి.

ఒకసారి ఆ వివరాలను గమనిస్తే… సినిమాను మొత్తం మీద 34 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా లాస్ట్ ఇయర్ నుండి ఆలస్యం అవ్వడంతో అప్పులు ఫైనాన్స్ వలన బడ్జెట్ పెరిగి 40 కోట్ల రేంజ్ కి చేరుకుందని ట్రేడ్ లో సమాచారం. ఇక సినిమా కు జరిగిన టోటల్ బిజినెస్ ను గమనిస్తే…

సినిమాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 41 కోట్ల రేటు కి కండీషన్ తో కొనగా సినిమా శాటిలైట్ రైట్స్ ని 7.5 కోట్ల రేటు కి అమ్మారు, ఇక మ్యూజిక్ రైట్స్ కింద 2 కోట్ల దాకా రేటు ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మరో 5 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో అన్నీ కలుపుకుని సినిమా బిజినెస్ 55.5 కోట్ల దాకా బిజినెస్ జరిగింది…

అమెజాన్ ప్రైమ్ మొదటి వారం ఆఫర్ నే తీసుకున్నా 37 కోట్ల రేటు అవ్వడం తో టోటల్ బిజినెస్ 51.5 కోట్ల దాకా ఉంటుంది అని చెప్పొచ్చు… ఏ లెక్కన చూసుకున్నా కానీ సినిమా వల్ల ఓవరాల్ గా నిర్మాతలకు 11.5 కోట్లు లేదా 15.5 కోట్ల దాకా ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here