Home న్యూస్ టక్ జగదీష్ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

టక్ జగదీష్ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

10306
0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ చాలా రోజులుగా థియేటర్స్ లో వస్తుందా లేక డైరెక్ట్ గా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు ఉండగా పరిస్థితులు ఏమాత్రం సహకరించేలా లేక పోవడం తో ఇక డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా సినిమా ట్రైలర్ లాంచ్ నుండి ఇది పక్కా కమర్షియల్ మూవీ కాదని ఫ్యామిలీ ఎమోషన్ మూవీ అని అందరికీ చెప్పారు మేకర్స్… మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే… భూదేవిపురం అనే ఊరిలో భూములను దోచుకోవాలి అని చూసే విలన్ ని హీరో ఫాధర్ అడ్డుగా నిలుస్తాడు, కానీ హీరో అన్నయ్య జగపతిబాబు కన్నింగ్ భూములన్నీ తనకే అనుకుంటాడు…. హీరో ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీ లో…

కొన్ని విభేదాలు వస్తాయి, తర్వాత హీరో ఊరిని ఫ్యామిలీని ఎలా కాపాడాడు అన్నది మొత్తం మీద స్టొరీ… ఈ కథ ఇప్పటి కథ అయితే కాదు… ఓ 20 ఏళ్ల క్రితం నాటి స్టొరీ లైన్ ని తీసుకుని డైరెక్టర్ కొన్ని మంచి సీన్స్ ని రాసుకుని ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా డైరెక్ట్ చేశాడు…

నాని తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు కానీ తన డైలాగ్స్ ఎందుకో కొంచం ఫోర్స్ గా చెబుతున్నాడు అనిపించింది… హీరోయిజం సీన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ తన మార్క్ కనిపించగా రితు వర్మ రోల్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా ఇద్దరి పెయిర్ బాగుంది… జగపతిబాబు రోల్ తనకి రొటీన్ అనే చెప్పాలి.. తను కూడా బాగా నటించగా…

ఐశ్వర్యరాజేష్ రోల్ తను ఇది వరకు ఓ తమిళ్ మూవీ లో ఉన్నట్లే ఇక్కడ ఉండటం గమనార్హం… ఇతర పాత్రలు ఓకే అనిపించగా, సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యేలా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం బాలేక పోవడం తో ఆ సీన్స్ కి ఎలివేషన్ కూడా పడలేదు…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో నరేషన్ తో ఉంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉండగా డైరెక్షన్ విషయానికి వస్తే… శివ నిర్వాన డైరెక్ట్ చేసిన మూవీస్ లో వీకేస్ట్ మూవీ ఇదే అనిపించింది… కథ ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం, కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది… అయినా కానీ ట్రైలర్ తో ఇది ఫ్యామిలీ ఎమోషన్ మూవీ అని…

డిక్లేర్ చేశారు ఆ పాయింట్ వ్యూ నుండే చూసుకుంటే ఫ్యామిలీస్ కి నచ్చే ఎమోషన్ సినిమాలో అడుగడుగునా ఉంది, సెకెండ్ ఆఫ్ మొత్తం తన కుటుంబాన్ని హీరో ఎలా సరిచేసుకున్నాడు, అన్నని ఎలా దారిలో పెట్టాడు లాంటి కంటెంట్ తో ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలానే తీర్చిదిద్దారు కానీ అది కేవలం ఫ్యామిలీస్ కి మాత్రమె ఎక్కువగా నచ్చుతుంది…

రెగ్యులర్ మూవీ లవర్స్ కి కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా జస్ట్ యావరేజ్ అనిపించడం ఖాయం, కానీ మేకర్స్ చెప్పినట్లు ఓన్లీ ఫ్యామిలీస్ వరకు చూసుకుంటే సినిమా ఓవరాల్ గా ఎబో యావరేజ్ అనిపించేలా ఉంది… మేకర్స్ డిజిటల్ లో రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారు అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here