పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉంటే ఎవ్వరైనా ఉన్న ఆప్షన్స్ లో బెటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటారు. సినిమాల వ్యాపారం ఎక్కువ శాతం ఫైనాన్స్ పైనే జరుగుతూ ఉంటుంది. భారీ మొత్తంలో ఫైనాన్స్ లో డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. సినిమాల బిజినెస్ లను బట్టి ఆ ఫైనాన్స్ అప్పులు పోగా నిర్మాతకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. కానీ సినిమాల రిలీజ్ లు ఆలస్యం అయ్యి ఆ ఫైనాన్స్ వడ్డీలు పెరిగి పోతూ ఉంటే…
ఆ డబ్బులు కట్టడంతోనే సరిపోతూ ఉంటే పరిస్థితి విషమిస్తుంది అని అర్ధం చేసుకోవాల్సిందే… ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులను రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అనేక సినిమాల విషయం లో జరుగుతూ ఉండగా నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ విషయం లో కూడా..
ఇదే జరుగుతుందని సమాచారం. ఎప్పటి నుండో రిలీజ్ కి ట్రై చేస్తున్నా పరిస్థితులు ఆంధ్రలో టికెట్ రేట్లు అస్సలు సెట్ అవ్వడం లేదు. మరో పక్క ఫైనాన్స్ ఇబ్బందులు కూడా ఉండటం తో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ రాగా ఫైనాన్స్ ఇబ్బందులు ఇంకా పెరిగి పోయేలా ఉండటం తో ఇప్పుడు సినిమాను…
ఇక తప్పక డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఫిక్స్ అయ్యారని టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. సినిమా కోసం ఫస్ట్ నుండి ట్రై చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా హక్కులను ఆల్ మోస్ట్ సొంతం చేసుకున్నట్లే అని అంటున్నారు ఇప్పుడు. టాలీవుడ్ తరుపున ప్రస్తుతం ఆల్ టైం హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు ని సొంతం చేసుకున్న
సినిమాగా ఇప్పుడు నాని టక్ జగదీష్ సినిమా ఆ రికార్డ్ 42 కోట్ల రేంజ్ రేటు తో డీల్ ని ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ జరిగినా ఇంత జరగడం కష్టమే… అలాగే ఇంకా సినిమా కి శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి అన్నీ పోయాక కూడా ఇప్పుడు నిర్మాతలు లాభాలు సొంతం చేసుకోవచ్చు. దీనిపై అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం.