బాలకృష్ణకి అఖండ ముందు ఒకటి తర్వాత ఒకటి వరుస డిసాస్టర్ మూవీస్ ఊహకందని దెబ్బ తీశాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు ఎపిక్ డిసాస్టర్ అవ్వగా మొదటి పార్ట్ నష్టాలను కవర్ చేస్తుంది అనుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు సింగిల్ డిజిట్ షేర్ కే పరిమితం అయింది, తర్వాత చేసిన రూలర్ అట్టర్ డిసాస్టర్ అవ్వడంతో బాలయ్య మార్కెట్ టోటల్ గా పతనం అయ్యే స్టేజ్ కి వచ్చేయగా ఆ టైంలోనే ఒక పక్క…
అఖండ సినిమా మరో పక్క అన్ స్టాపబుల్ షో బాలయ్యకి తిరిగి సాలిడ్ కంబ్యాక్ గా నిలిచింది. అఖండ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి హిట్ తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే ఊహకందని రేంజ్ ఓపెనింగ్ డే వసూళ్ళని సాధించింది…
వాల్తేరు వీరయ్యతో పోల్చితే ఎంటర్ టైన్ మెంట్ లేక పోవడం, ఓన్లీ మాస్ నే నమ్ముకున్న వీర సింహా రెడ్డి రెండో రోజు నుండి స్లో అయినా కానీ స్టడీ కలెక్షన్స్ తో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పుడు బాలయ్య కెరీర్ లో బాక్ టు బాక్ 2 100 కోట్ల గ్రాస్ మూవీస్ తో సంచలనం సృష్టించాయి…
అఖండ ముందు బాలయ్య కెరీర్ గ్రాఫ్ ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఉన్న గ్రాఫ్ పెరిగిన రీచ్ నెక్స్ట్ లెవల్ రాంపేజ్ అనే చెప్పాలి. అప్ కమింగ్ మూవీస్ ఈ 2 సినిమాల మాదిరిగానే ఆకట్టుకుంటే బాలయ్య మార్కెట్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక వీర సింహా రెడ్డి లాంగ్ రన్ లో అఖండని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.