Home గాసిప్స్ ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ OTT రిలీజ్….షాకింగ్ రేటు!!

ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ OTT రిలీజ్….షాకింగ్ రేటు!!

1457
0

కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస విజయాలతో అప్ కమింగ్ హీరోల్లో ఎవ్వరూ సాధించలేని రికార్డులు క్రియేట్ చేసిన హీరో ఉదయ్ కిరణ్… మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలవ గా తర్వాత చేసిన కలుసు కోవాలనీ మరియు శ్రీరామ్ సినిమా లు కూడా మెప్పించినప్పటి కీ తర్వాత సినిమా లు మాత్రం అంచనాలను అందుకోక పోవడం తో కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది.

దానికి తోడూ వ్యక్తిగత కారణాలు కూడా తోడు అవ్వడం తో అన్నీ తట్టుకోలేక ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వీడి వెళ్ళాడు. తను చేసిన చివరి సినిమాల్లో ఒక్క సినిమా మాత్రం తనకి బాగా నచ్చిన సినిమా అదే చివరి సినిమా అయ్యింది.

అదే చిత్రం చెప్పిన కథ సినిమా… ఈ సినిమా రిలీజ్ తర్వాత తన లైఫ్ మళ్ళీ జోరు అందుకుంటుంది అనుకున్న అలా జరగలేదు, సినిమా రిలీజ్ నిరవధికంగా ఆగిపోగా… రీసెంట్ గా సినిమా ను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించగా సినిమా కి డీసెంట్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా కానీ భారీగా తగ్గిన ఉదయ్ కిరణ్ మార్కెట్ దృశ్యా 1 నుండి 1.5 కోట్ల రేంజ్ బిజినెస్ చేసేదేమో కానీ సినిమా కి ఇప్పుడు OTT ఆఫర్స్ భారీగానే వస్తున్నాయట. సినిమా కి రేటు 3 కోట్లకి అటూ ఇటూగా రేటు ఆఫర్ దక్కిందని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు ప్రచారం లో ఉన్నాయి.

ఇది అనుకున్న రేటు కన్నా కూడా డబుల్ ఆఫర్ అనే చెప్పాలి… ఉదయ్ కిరణ్ ని చివరి సారి చూడాలి అని అనుకోని ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ లేరు… అందుకే ఈ సినిమా ను త్వరలో నే డిజిటల్ రిలీజ్ మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here