Home న్యూస్ ఉగ్రం మూవీ రివ్యూ….రేటింగ్!!

ఉగ్రం మూవీ రివ్యూ….రేటింగ్!!

0

నాంది సినిమాతో తన రూట్ ని మార్చుకున్న అల్లరి నరేష్ తర్వాత చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వచ్చినా ఆ సినిమా నిరాశనే మిగిలించగా ఇప్పుడు తిరిగి నాంది కాంబోతో చేస్తున్న లేటెస్ట్ మూవీ ఉగ్రం ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే CI అయిన హీరో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు…. 5 ఏళ్ల తర్వత అనుకోకుండా తన భార్య మరియు కూతురు కిడ్నాప్ అవుతారు, అది ఒక యాక్సిడెంట్ లో జరగగా ఆ ఇంసిడెంట్ లో హీరో గతం మర్చిపోతాడు… ఆ తర్వాత ఏమయింది… తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసింది ఎవరు… గతం మర్చిపోయిన హీరో ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా స్టార్ట్ అవ్వడం కొంచం స్లోగా స్టార్ట్ అవ్వగా టేక్ అవ్వడానికి టైం అయిన తర్వాత అసలు కథలోకి ఎంటర్ అయినప్పటి నుండి సినిమా మంచి జోరుని చూపిస్తూ ఇంటెన్స్ యాక్షన్ తో ఇంటర్వెల్ వరకు ఫుల్ రేసీగా కథ సాగగా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది…

ఇక సెకెండ్ ఆఫ్ లో కొన్ని ట్విస్ట్ లు టర్న్ లు బాగున్నా కథ ఓవరాల్ గా లాగ్ గా ఉండటం, ఎమోషనల్ పార్ట్ మరీ డోస్ పెరిగి పోవడం లాంటివి కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయి… అయినా కానీ సినిమాలో వచ్చే యాక్షన్ పార్ట్ మాస్ ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉండగా, చాలా వరకు కథ ఎంగేజింగ్ గా అనిపించినా సినిమాలో ఫ్లాస్ కూడా చాలానే ఉన్నాయి…

ఎమోషనల్ పార్ట్ కనెక్ట్ లేక పోవడం, ఫైట్స్ డోస్ కూడా ఓవర్ గానే ఉండటం, లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అయినా కానీ అల్లరి నరేష్ నుండి ఇలాంటి మేక్ ఓవర్ ని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. తన పెర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా…

హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా అదిరిపోయాయి. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ జస్ట్ ఓకే అనిపిస్తారు, సంగీతం పర్వాలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగా సెట్ అయింది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించినా కొన్ని సీన్స్ లో ట్రాక్ తప్పింది… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా డైరెక్షన్ పరంగా విజయ్ కనకమేడల ఎంచుకున్న పాయింట్ బాగుండగా…

ఫస్టాఫ్ వరకు బాగానే మెప్పించినా సెకెండ్ ఆఫ్ లో సినిమా కొంచం ట్రాక్ తప్పడంతో ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి మరీ ఫుల్ గా సాటిస్ ఫై కాక పోయినా కానీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, అలాగే ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా కొంచం స్లోగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగుస్తుంది… అల్లరి నరేష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కోసం కొంచం ఓపికతో చూస్తె ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది సినిమా… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here