Home న్యూస్ UI మూవీ 1st డే కలెక్షన్స్….మాస్ రచ్చ చేసిన ఉపేంద్ర!

UI మూవీ 1st డే కలెక్షన్స్….మాస్ రచ్చ చేసిన ఉపేంద్ర!

0

కన్నడ సెన్సేషనల్ యాక్టర్ డైరెక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్, మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…

ఇక ఓపెనింగ్స్ పరంగా సినిమా కర్ణాటకలో మాత్రం ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది……ఈ ఇయర్ కన్నడ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తూ ఏకంగా 7.3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

ఇక తెలుగు రాష్ట్రాలలో ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 70 లక్షల రేంజ్ లో ఉండగా ఫైనల్ గా మొదటి రోజు 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇక్కడ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…

ఇక సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని అంచనా….సినిమా టోటల్ గా మొదటి రోజు షేర్ ఆల్ మోస్ట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 32-35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా…

ఇక సినిమా రెండో రోజు ఉన్నంతలో కర్ణాటకలో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతుంది. కానీ ఇక్కడ కొంచం మిక్సుడ్ టాక్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఇంకా తేరుకుని స్ట్రాంగ్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here