Home న్యూస్ 3 కోట్ల బడ్జెట్…5.2 కోట్ల ఆఫర్… రిలీజ్ డేట్ కన్ఫాం!

3 కోట్ల బడ్జెట్…5.2 కోట్ల ఆఫర్… రిలీజ్ డేట్ కన్ఫాం!

428
0

బాహుబలి నిర్మాతల నుండి వస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య…. మలయాళం లో ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన మహేశింతే ప్రతీకారం సినిమా కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా టీసర్ రిలీజ్ తో మంచి బజ్ నే సొంతం చేసుకుంది. కాగా సినిమా ని ముందు అనుకున్నట్లే థియేటర్స్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. నెట్ ఫ్లిక్స్ సినిమాకి మంచి….

ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం… సినిమా ఓవరాల్ బడ్జెట్ 3 కోట్ల రేంజ్ కన్నా తక్కువే ఉండగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ రేటు 5.2 కోట్ల రేంజ్ లో ఉందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. సినిమా బడ్జెట్ కి ఇది….

మంచి రేటు అనే చెప్పాలి. ఇక శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ తో సినిమా కి మరో 2.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది ట్రేడ్ లో అనుకుంటున్నారు. దాంతో ఓవరాల్ గా సినిమా 8.1 కోట్ల రేంజ్ థియేట్రికల్ బిజినెస్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద 5.1 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని కూడా…

సొంతం చేసుకున్న ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 15 న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. కేవలం తెలుగు వరకు వచ్చిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఆఫర్ ని సొంతం చేసుకున్న సినిమా ఇదే అని చెప్పాలి. మిగలిన సినిమాలు ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఈ సినిమా అప్పటి వరకు తెలుగు వరకు టాప్ లో ఉండబోతుంది.

మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా నే కనుక తెలుగు లో కూడా సినిమా కి మంచి టాక్ లభించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఒరిజినల్ లాగే తెలుగు లో ఎంతవరకు మెప్పిస్తుంది అన్నది ఈ నెల 15 న తేలనుంది అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here