నందమూరి మరియు మెగా హీరోల ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో రాజమౌళి చేస్తున్న ఎపిక్ మల్టీ స్టారర్ మూవీ తో ఫ్యాన్ వార్స్ మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరు ఆశగా ఎదురు చూస్తున్న RRR సినిమా యూనిట్ నుండి.
ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్ రానుంది అని చెప్పొచ్చు. త్వరలోనే సినిమా యూనిట్ అఫీషియల్ ప్రెస్ మీట్ లో సినిమా గురించిన విశేషాలు, ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ వివరాలు ఒక్కొటిగా వివరించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.
దాంతో ఒక్కసారి గా ఇరు ఫ్యాన్స్ వర్గాలలో ఆ ప్రెస్ మీట్ పై ఆసక్తి ఓ రేంజ్ లో పెరిగి పోయింది అని చెప్పొచ్చు. దీని పై ఒకటి రెండు రోజుల్లో అఫీషియల్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.