కన్నడ సెన్సేషనల్ యాక్టర్ డైరెక్టర్ ఉపేంద్ర(Upendra) సినిమాలు అంటే తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది…ఉపేంద్ర మూవీస్ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రావడమే దీనికి మేజర్ కారణం అయితే అప్పుడు తన డైరెక్షన్ లో వచ్చే సినిమాల మీద మరింత ఆసక్తి ఉంటుంది. అప్పట్లో సూపర్ అనే సినిమాతో బాగా మెప్పించిన ఉపేంద్ర…
చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందు యుఐ మూవీ(UI Movie Review in Telugu) తో వచ్చేశాడు….ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా కూడా కచ్చితంగా మెప్పిస్తుంది అని అందరూ అనుకున్నారు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే…
పక్క వారి కోసం ఏమైనా చేసే వ్యక్తిత్వంతో పెరిగిన హీరో ని చూసి అందరూ తనని మెచ్చుకుంటూ ఉంటారు…కానీ అదే టైంలో ప్రకృతి ని సమాజంలో కొందరు ఇష్టం వచ్చినట్లు పాడు చేయడంతో కోపం పెంచుకున్న మరో హీరో కల్కి ఓ మారణ హోమం చేస్తాడు…ఒకేలా ఉన్న..
వీళ్ళ ఇద్దరు ఎలా కలిశారు…కలిసిన తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ పాయింట్….ఓవరాల్ గా కథ పాయింట్ ఆసక్తి కలిగించేలా నే ఉండగా ఉపేంద్ర తనదైన స్టైల్ అండ్ డిఫెరెంట్ యాక్టింగ్ తో మెప్పించాడు. కొన్ని సీన్స్ బాగానే పేలాయి కూడా…కానీ ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే..
కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా ఏ దశలోనూ ఆడియన్స్ ను కుర్చీలో కూర్చోనివ్వలేక పోయింది, ఫస్టాఫ్ పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించగా మంచి ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగాయి కానీ సెకెండ్ కథ కూడా..
ఎటు నుండి ఎటో వెళుతూ తల తోకా లేకుండా పోయింది. దాంతో ఒక దశ దాటాక చూస్తున్న ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతూ ఉండగా అక్కడక్కడా సీన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది…
ఉపేంద్ర నటుడిగా మెప్పించినా డైరెక్టర్ గా కొన్ని సీన్స్ వరకు మాత్రమే తన మ్యాజిక్ ని చూపించగా చాలా వరకు సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేశాయి. కన్ఫ్యూజిక్ స్క్రీన్ ప్లే తో కాకుండా స్ట్రైట్ నరేషన్ తో సినిమాని చెప్పి ఉన్నా ఒకసారి ఈజీగా చూసేలా ఉండేది..
కానీ అలా చెప్పక పోవడం వలన కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు అనిపించినా సినిమా మొత్తం చూడాలి అంటే చాలా ఓపిక చేసుకుని చూస్తె ఒక సారి చూడొచ్చు అనిపించేలా అనిపించింది సినిమా…పెద్దగా ఎక్స్ పెర్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్లి ఓపిక పట్టి చూస్తె ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా…సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…