బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి నెల ని అన్ సీజన్ గా భావిస్తారు, దాంతో స్టార్స్ నటించిన సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ 2013 టైంలో ప్రభాస్ మిర్చి సినిమా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అవ్వగా ఆ సినిమా కలెక్షన్స్ రికార్డ్ ను ఫిబ్రవరిలో ఆల్ మోస్ట్ 8 ఏళ్ల పాటు ఏ సినిమా బ్రేక్ చేయలేదు… కానీ 2021 టైంలో భారీ హైప్ నడుమ….
ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉప్పెన మూవీ స్టార్ట్ కాస్ట్ అంతా కొత్త వాళ్ళే అయినా కానీ ఊహకందని రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని మిర్చి రికార్డ్ కలెక్షన్స్ ని ఫిబ్రవరిలో బ్రేక్ చేసి ఫిబ్రవరిలో హైయెస్ట్ కలెక్షన్స్ ని టాలీవుడ్ తరుపున అందుకున్న సినిమాగా నిలిచింది..
అలాంటి రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ అఫీస్ బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 15.63Cr
👉Ceeded: 7.80Cr
👉UA: 8.58Cr
👉East: 5.08Cr
👉West: 2.63Cr
👉Guntur: 3.01Cr
👉Krishna: 3.21Cr
👉Nellore: 1.78Cr
AP-TG Total:- 47.72CR(78.40Cr Gross~)
Ka+ROI – 2.38Cr
Os – 1.42Cr
Total – 51.52Cr(85Cr~ Gross)
ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకుని బిజినెస్ మీద ఏకంగా 31.02 కోట్ల ప్రాఫిట్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి కలెక్షన్స్ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.