Home న్యూస్ 2nd వేవ్ తర్వాత థియేటర్ లో ఉప్పెన రిలీజ్…ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!!

2nd వేవ్ తర్వాత థియేటర్ లో ఉప్పెన రిలీజ్…ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!!

1718
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వేవ్ తర్వాత తేరుకున్న ఇండస్ట్రీలలో ముందు నిలిచే ఇండస్ట్రీ టాలీవుడ్… వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకు పోయిన టాలీవుడ్ కి మళ్ళీ సెకెండ్ వేవ్ దెబ్బ తీవ్రంగా తగిలింది. ఆల్ మోస్ట్ 3 నెలలుగా థియేటర్స్ అన్ని కూడా మూత బడి ఉండగా ఇప్పుడిప్పుడే థియేటర్స్ ని రీ ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా సినిమాలు ఏమి లేక పోవడం తో జనాలు థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు….

Uppena 4 Days Total World Wide Collections

ఇలాంటి టైం లో ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ తరుపున హైయెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సినిమా ఉప్పెన మీద భారం వేసి చిన్న ట్రైల్ వేశారు థియేటర్ లో… ఈ సినిమా వైజాగ్ లో జగదాంబ థియేటర్ లో 11 వ తేదీ న…..

Uppena 7 Days Total World Wide Collections

రోజు మొత్తం కలిపి 3 షోలు వేశారు… అది కూడా 50% లిమిటేషన్ తో వేయగా రోజు మొత్తం మీద సినిమా కి డీసెంట్ కలెక్షన్స్ సొంతం అవ్వడం జరిగింది. మార్నింగ్ షో కి 2924, మ్యాట్నీ షో కి 4433 మరియు ఈవినింగ్ షో కి వచ్చే సరికి 3052 వేలని కలెక్ట్ చేసింది ఈ సినిమా…

Uppena 12 Days Total World Wide Collections

దాంతో మూడు షోలు కలిపి 10409 వేల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది… నైట్ కర్ఫ్యూ ఇప్పటికీ అక్కడ కొనసాగుతూ ఉండటం తో 3 షోలు మాత్రమే వేసినా ఓవరాల్ గా ఒక్క థియేటర్ లోనే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఉప్పెన కి ఇప్పుడు మరిన్ని థియేటర్స్ ని పెంచే ఆలోచన చేస్తున్నారు. డీసెంట్ కలెక్షన్స్ రావడం తో…

Uppena 11 Days Total World Wide Collections

ఇతర సినిమాలు కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. నెల ఎండ్ నుండి మళ్ళీ సినిమాలు థియేటర్స్ లో క్యూ కట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో జనాలు మళ్ళీ థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉందని ఉప్పెన కలెక్షన్స్ చూస్తుంటే ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయని చెప్పొచ్చు. 3rd వేవ్ రాకుండా ఉంటే టాలీవుడ్ త్వరగానే మళ్ళీ తిరిగి కోలుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Uppena 3 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here