Home గాసిప్స్ ఆ ట్విస్ట్ జీర్ణించుకోవడం కష్టమే అంటున్నారే…ఉప్పెన షాకింగ్ అప్ డేట్!

ఆ ట్విస్ట్ జీర్ణించుకోవడం కష్టమే అంటున్నారే…ఉప్పెన షాకింగ్ అప్ డేట్!

2669
0

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన… బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా డిజిటల్ రిలీజ్ కి ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లు వచ్చినా కానీ వాటి అన్నింటికీ నో చెబుతూ వస్తున్న యూనిట్ సినిమాను ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు.

ముందు సంక్రాంతి రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు సినిమాను కుదిరితే ఫిబ్రవరి లో లేదా మార్చ్ ఎండ్ టైం లో ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తుండగా సినిమా కి సంభందించిన అన్ని పనులు కూడా పూర్తీ అయినట్లు యూనిట్ నుండి సమాచారం అందుతుంది.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తీ అవ్వగా సినిమా చూసిన యూనిట్ సినిమా ఔట్ పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ పై మాత్రం కొంచం టాక్ మిక్సుడ్ గా ఉందని అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో… ఆ వార్తల ప్రకారం…

సినిమా క్లైమాక్స్ అందరికీ భారీ షాక్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు, అంటే హీరో హీరోయిన్స్ లో ఎవరో ఒకరు చనిపోవడం లాంటిది ఈ మధ్య రెగ్యులర్ అయ్యింది కదా ఇంకా షాక్ ఎం ఉంటుంది అని అనుకున్నా అలాంటి కాన్సెప్ట్ కాకుండా కొత్తగా ఆలోచించి ఈ సారి మరింత డిఫెరెంట్ గా క్లైమాక్స్ ని షాకింగ్ గా డిసైన్ చేశారని అంటున్నారు. మరి అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తి కరంగా ఉండగా…

పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే మట్టుకు సినిమా కి అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు, మరి ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి అనేది మాత్రం ఇంకా రివీల్ అవ్వాల్సి ఉండగా సినిమా ఇప్పటికే మంచి బజ్ ని సొంతం చేసుకోగా త్వరలోనే సినిమా టీసర్ రిలీజ్ కానుంది అని సమాచారం… టీసర్ తోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here