Home న్యూస్ ఉప్పెన రివ్యూ…..ప్లస్-మైనస్ పాయింట్స్!!

ఉప్పెన రివ్యూ…..ప్లస్-మైనస్ పాయింట్స్!!

0

చిన్న సినిమా నే అయినా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన… మెగా ఫ్యామిలీ నుండి పంజా వైష్ణవ్ తేజ్, కొత్తమ్మాయి కృతి శెట్టి లాంచ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం, దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ మ్యూజిక్, సుకుమార్ స్క్రీన్ ప్లే వలన విపరీతమైన హైప్ వచ్చింది. మరి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉప్పెన అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ..

ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే… చిన్నప్పటి నుండే హీరోయిన్ అంటే హీరో కి ఇష్టం, తర్వాత హీరోయిన్ కి కూడా హీరో అంటే ఇష్టం కలుగుతుంది, ఇద్దరూ ప్రేమించికుంటారు, ఈ విషయం కొంచం లేట్ గా హీరోయిన్ ఫాదర్ విలన్ అయిన సేతుపతి కి తెలుస్తుంది… మరి సేతుపతి ఎం చేశాడు…

ప్రేమికులు ఇద్దరూ కలిశారా లేరా అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. పెర్ఫార్మెన్స్ పరంగా ఫస్ట్ మూవీనే అయినా ఇటు వైష్ణవ్ తేజ్ అటు కృతి బాగా ఆకట్టుకున్నారు. కొన్ని చోట్ల తెలిపోయినా చాలా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఇద్దరూ మెప్పించారు, ఇక విజయ్ సేతుపతి డబ్బింగ్ సెట్ కాలేదు, అది పక్కకు పెడితే…

తన స్క్రీన్ ప్రజన్స్ అండ్ విలనిజం తో ఓ రేంజ్ లో మెప్పించాడు… సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విజయ్ సేతుపతి, ఇక హీరో ఫాదర్ గా సాయి చంద్ కూడా బాగా మెప్పించాడు… ఇక వీళ్ళ రేంజ్ కి ఏమాత్రం తగ్గని సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్, ప్రతీ పాట వినడానికి ఎంత బాగుందో విజువల్స్ కూడా అద్బుతంగా ఉన్నాయి… బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది, విజయ్ సేతుపతికి ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు, ఫస్టాఫ్ అలాగే సెకెండ్ ఆఫ్ లో ఎక్కువగా డ్రాగ్ అయింది, అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంది… సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్, నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి, ఇక డైరెక్షన్ పరంగా బుచ్చిబాబు ఎంచుకున్న కథ మనం ఆల్ రెడీ ఎన్నో లవ్ స్టొరీలలో చూసిందే…

ఆ కథ పాయింట్ ని చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు బుచ్చుబాబు, ఫస్టాఫ్ వరకు కథ ఫ్రెష్ గా బాగానే మెప్పించినా కానీ సెకెండ్ ఆఫ్ లో కొద్ది సేపు తర్వాత స్లో అవ్వడం మొదలు అవుతుంది, దానికి తోడూ కథ పాయింట్ సింపుల్ అవ్వడంతో అప్పటి వరకు పెద్దగా జోరు పెంచేలా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, విజయ్ సేతుపతి విలనిజం తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు తక్కువ..

ఇక అలాంటి టైం లో సినిమా ప్రీ క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ తో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని టర్న్ తీసుకుంటుంది సినిమా. తర్వాత క్లైమాక్స్ ని చాలా బాగా ముగించి అప్పటి వరకు జస్ట్ ఓకే లా అనిపించిన సినిమాను బాగుంది అనిపించేలా ముగించాడు డైరెక్టర్… కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడే చెప్పలేం…

ఒకవేళ బాగా రిసీవ్ చేసుకుంటే అది సినిమా కి బాగా కలిసి వస్తుంది. ఇక హైలెట్స్ విషయానికి వస్తే ముందే చెప్పినట్లు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్, విజయ్ సేతుపతి విలనిజం… క్లైమాక్స్ ని అని చెప్పాలి, ఇక మైనస్ పాయింట్ చాలా సింపుల్ స్టొరీ, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం విజయ్ సేతుపతి తెలుగు డబ్బింగ్ అని చెప్పాలి…

మొత్తం మీద సింపుల్ గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఈజీగా ఒకసారి చూడొచ్చు, కాలేజ్ యూత్ ని సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుంది, ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సెకెండ్ ఆఫ్ ట్విస్ట్ ని రిసీవ్ బాగా చేసుకుంటే సినిమా రీచ్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here