Home న్యూస్ ఉప్పెన టీసర్ రివ్యూ….బాగుంది టీసర్!!

ఉప్పెన టీసర్ రివ్యూ….బాగుంది టీసర్!!

544
0

లాస్ట్ ఇయర్ నుండి ఎక్కువగా పాటలతో పాపులర్ అయ్యి డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వస్తున్నా నో చెబుతూ వస్తూ ఎప్పటి కప్పుడు వార్తల్లో నిలిచిన సినిమాలలో ఉప్పెన సినిమా కూడా ఒకటి. మెగా ఫ్యామిలీ నుండి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా సినిమా పాటలు ఓ రేంజ్ లో హిట్ అవ్వగా ఎట్టకేలకు సినిమా అఫీషియల్ టీసర్ ను…

సంక్రాంతి కానుకగా ఇప్పుడు రిలీజ్ చేశారు. కాగా సినిమా టీసర్ బాగా మెప్పించింది అని చెప్పాలి, దేవి శ్రీ ప్రసాద్ సోల్ ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించిన టీసర్ చాల ఫ్రెష్ విజువల్స్ తో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళే అయినా కానీ బాగానే అనిపించారు.

దానికి కారణం పాటల ద్వారా మరింత ఎక్కువగా సినిమా పాపులర్ అవ్వడమే అని చెప్పాలి. ఇక టీసర్ లో కథ ఏంటి అనేది చెప్పేశారు… పెద్దింటి అమ్మాయి… పేద అబ్బాయి… ఒకరినొకరు ప్రేమించుకోవడం లాంటి రొటీన్ కథ పాయింట్ తోనే సినిమా తెరకేక్కినా కూడా…

ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటుంది అని క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మరో లెవల్ లో ఉంటుంది అని ఆల్ రెడీ టాక్ ఉంది, అందుకు తగ్గట్లు గానే టీసర్ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ తో టీసర్ ను ముగించారు, ఆ ట్విస్ట్ ఏంటి… ఇద్దరూ కలిశారా లేదా అన్నది మాత్రం ఇక సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి. టీసర్ మట్టుకు రీ ఫ్రెషింగ్ గా మెప్పించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ టీసర్ కి హైలెట్ అయ్యాయి. కోనసీమ యాసతో హీరో మెప్పించగా లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తోనే హీరోయిన్ ఫుల్ మార్కులు దక్కించుకుంది. ఇక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇక టీసర్ మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here