Home గాసిప్స్ షాకింగ్ రూమర్: ఉప్పెన మూవీ లెంత్ అంతనా…ఓవర్ బడ్జెట్!!

షాకింగ్ రూమర్: ఉప్పెన మూవీ లెంత్ అంతనా…ఓవర్ బడ్జెట్!!

1041
0

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్… హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ కథ అందించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఆల్ మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి స్టేజ్ లో ఉందని అంటున్నారు. ఇక సినిమా ఎప్పుడో సమ్మర్ రేసులో నిలిచినప్పటికీ కరోనా వల్ల ఆగిపోగా సినిమా ను డిజిటల్ రిలీజ్ చేయించడం కోసం…

OTT యాప్స్ గట్టిగానే ట్రై చేసినా కానీ రేటు సమంజసంగా లేక పోవడం, సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడం వీటితో పాటు హీరో లాంచ్ మూవీ కాబట్టి ఎలాగైనా సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అవ్వడం తో సినిమా డిజిటల్ రిలీజ్ జరగలేదు.

ఇక సినిమా పై ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక షాకింగ్ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ సినిమా ఓవరాల్ లెంత్ చూసుకుంటే చాలా ఎక్కువ లెంత్ తో ఉందని అంటున్నారు. ఆల్ మోస్ట్ 3 గంటల 35 నిమిషాల లెంత్ సినిమా కి ఉందని అంటున్నారు.

అందువలనే ఈ మధ్య పార్ట్ 1 పార్ట్ 2 లా డిజిటల్ రిలీజ్ చేయాలన్న ఆలోచన వచ్చింది అన్న టాక్ కూడా వచ్చింది. ఇక సినిమా కి రీ షూట్లు చాలానే జరిగాయని, వాటి వలనే సినిమా లెంత్, అలాగే బడ్జెట్ పెరిగిందని అంటున్నారు. అవి నిజం అయితే సినిమా ఓవరాల్ లెంత్ ఇప్పుడు 3 గంటల 35 నిమిషాల రేంజ్ లో…

అలాగే రీ షూట్ లు టోటల్ లెంత్ ని బట్టి సినిమా ఓవరాల్ బడ్జెట్ కూడా 22 కోట్ల దాకా అయిందని టాక్ ఉంది. అందువలనే సినిమా కి వచ్చిన బిజినెస్ ఆఫర్స్ 16-17 కోట్ల దాకా వెళ్ళినా నిర్మాతలు సినిమా ను అమ్మమని చెప్పారు అంటున్నారు. మరి ఈ రూమర్స్ పై నిజా నిజాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here