ఓవర్సీస్ మార్కెట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కి మొదటి నుండి కూడా ఎక్స్ లెంట్ క్రేజ్ ఉంది. తన ప్రతీ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉండగా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు సైతం మాస్ రచ్చ చేస్తూ ఉండగా 2010 లో డిసాస్టర్ అయిన ఖలేజా(Khaleja4K) సినిమా…
ఇప్పుడు ఇక్కడ రికార్డుల భీభత్సం సృష్టిస్తూ ఉండగా ప్రీవియస్ రికార్డులను సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను అందుకుంది. ఇది వరకు ఇక్కడ గబ్బర్ సింగ్ మరియు ఇంద్ర లాంటి సినిమాలు ఆల్ మోస్ట్ 66 వేల రేంజ్ లో డాలర్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ హోల్డర్ గా…
ఉండగా ఈ రికార్డులను అతడు సినిమా సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆ సినిమా కన్నా ముందే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఖలేజా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ప్రీమియర్స్ అండ్ డే1 కలెక్షన్స్ తోనే మాస్ ఊచకోత కోయగా…
తర్వాత కూడా దుమ్ము లేపుతూ ఇప్పుడు ఆల్ మోస్ట్ 110K డాలర్స్ మార్క్ రేంజ్ లో దుమ్ము లేపుతూ భీభత్సం సృష్టిస్తుంది. ఒకసారి అక్కడ టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
North America Re-release TOP Grossers:
👉#Khaleja4K – $110K******
👉#GabbarSingh – $66.1k
👉#Indra – $65.7k
👉#Murari – $60.6k
👉#Simhadri – $59.8k
👉#JVAS – $52.8k
👉#ChennaKesavaReddy – $51.1K
ఓవరాల్ గా ప్రీవియస్ రికార్డ్ మీద ఆల్ మోస్ట్ 44 వేల రేంజ్ లో లీడ్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిన ఖలేజా సినిమా అప్ కమింగ్ రీ రిలీజ్ లకు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసింది..ఇక ఈ రికార్డ్ ను ఈ ఇయర్ లో ఎన్ని సినిమాలు అందుకునే ప్రయత్నం చేస్తాయో చూడాలి.