Home న్యూస్ 35.4 కోట్ల రేటు….నెల రోజుల్లో వి మూవీ కలెక్షన్స్ లెక్కలు ఇదేనా!!

35.4 కోట్ల రేటు….నెల రోజుల్లో వి మూవీ కలెక్షన్స్ లెక్కలు ఇదేనా!!

0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన వి ది మూవీ లో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించగా సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కానీ తర్వాత డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, దిల్ రాజు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి తన తెలివి తేటలతో ఏకంగా 35.4 కోట్ల రేటు కి అమ్మగా సినిమా సెప్టెంబర్ మొదటి వారం లో…

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా…. సినిమా కి మిక్సుడ్ టాక్ లభించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ సినిమా వ్యూస్ పై గట్టిగానే పడిందని ఇప్పుడు మొదటి నెల లెక్కలు చూస్తె అర్ధం అవుతుంది, ఓవరాల్ గా డైరెక్ట్ డిజిటల్ అయిన వి మూవీ…

మొదటి నెల రోజుల ప్రైమ్ వ్యూస్ లెక్కలు యూనిట్ కి అందగా అక్కడ నుండి ట్రేడ్ కి అవి చేరాయి… ఆ లెక్కల ప్రకారం సినిమా కి మొత్తం మీద మొదటి రోజు ఇండియా వైడ్ గా 6 లక్షల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. తర్వాత వీకెండ్ కి వచ్చే సరికి 9.5 లక్షల దాకా వ్యూస్ వచ్చాయట…

ఇక మొదటి వారానికి 1.1 మిలియన్ వ్యూస్ ని….. మొదటి నెల రోజుల విషయానికి వస్తే 1.5 మిలియన్ వ్యూస్ దాకా సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ టాక్… కొంచం అటూ ఇటూగా సినిమా యూనిక్ వ్యూస్ లెక్కలు ఈ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు… కానీ ఇవి 100% కన్ఫాం అయితే కాదని చెప్పొచ్చు…

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ ఒక నెల సబ్ స్క్రిప్షన్ 129 రేటు ఉండగా అదే సినిమా టికెట్ రేటు అనుకుంటే సినిమా మొదటి రోజు మొత్తం మీద 6 లక్షల టికెట్ సేల్స్ కి 7.74 కోట్ల రెవెన్యూ తెచ్చిపెట్టినట్లు లెక్క. ఇక మొదటి వీకెండ్ కి 9.5 లక్షల వ్యూస్ కి సుమారుగా…

12.25 కోట్ల రేంజ్ లో రెవెన్యూ తెచ్చి పెట్టినట్లు అంచనా వేయవచ్చు…. ఇక సినిమా మొదటి వారానికి గాను…1.1 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి కాబట్టి… 14.19 కోట్ల దాకా రెవెన్యూ వచ్చినట్లు అంచనా వేయవచ్చు. ఇక మొదటి నెల రోజులకు గాను…

సినిమా కి టోటల్ గా 1.5 మిలియన్స్ దాకా వ్యూస్ రావడం తో…19.35 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చినట్లు అనుకోవచ్చు… సినిమా కోసం 35.4 కోట్ల రేంజ్ లో ఖర్చు చేసిన అమెజాన్ ప్రైమ్ పబ్లిసిటీ కోసం కూడా భారీగా ఖర్చు చేసింది. కానీ సినిమా మొత్తం మీద మొదటి నెల రోజుల్లో…..

మరీ అనుకున్న రేంజ్ లో రిటర్న్ లు తీసుకు రాలేక పోవడం తో నిర్మాతని అప్రోచ్ అయ్యి ఎంతో కొంత డబ్బులు రిటర్న్ అడిగిందని లేటెస్ట్ గా వార్తలు ప్రచారం లో ఉన్న విషయం తెలిసిందే. ఓవరాల్ గా చూసుకుంటే ఈ లెక్కలు ఒరిజినల్ లెక్కలకు దగ్గరి లెక్కలు అయితే…

సినిమా అమెజాన్ ప్రైమ్ కి ప్రాఫిట్ లు తెచ్చి పెట్టాలి అంటే 35.4 కోట్ల రేటు కి మొదటి నెలలో సాధించిన 19.35 కోట్ల రేంజ్ కలెక్షన్స్ కాకుండా మరో 16.05 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెచ్చి పెట్టాల్సి ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇక పబ్లిసిటీ ఖర్చులు ఎంత అనేది తెలియవు కాబట్టి అవి రికవరీ అవుతాయో లేదో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here