కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటున్నా కానీ ఆడియన్స్ ని మెప్పించ లేక పోతున్నాయి…. కోట్లు పెట్టి బయ్యర్లు కొన్న సినిమాలు థియేటర్స్ లో ఫ్లాఫ్ అయినట్లు ఇక్కడ కోట్లు పెట్టి కొన్న డిజిటల్ కంపెనీలు అన్ని ఆ సినిమాలకు వ్యూస్ రాక పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం గా మారేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు.. ఇప్పుడు ఇలాంటి దే ఒకటి జరిగింది అని టాక్…
ఇండియా లో లీడింగ్ OTT కంపెనీ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ముందు వెనకా చూసుకోకుండా టాలీవుడ్ సినిమాలకు కోట్లకి కోట్లు ఆఫర్ చేసి సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేలా ఒప్పిస్తున్నాయి, నిర్మాతలు కూడా వాళ్ళతో సినిమా అద్బుతం అమోఘం అంటూ ఊదరగొట్టి…
ఎక్కువ రేటు దక్కేలా చేస్తున్నారు… ఇప్పుడు వి ది మూవీ కి నిశ్శబ్దం సినిమాల విషయం లో ఇదే జరగగా వి ది మూవీ రిలీజ్ అయ్యి నెల అవ్వగా… వ్యూస్ అండ్ ఈ సినిమా వల్ల వచ్చిన కొత్త సబ్ స్ర్కైబర్స్ కూడా పెట్టిన రేటు కి ఏమాత్రం సంభందం లేకుండా రావడం తో షాక్ అయ్యారట.
వెంటనే నిర్మాత దిల్ రాజు తో వాళ్ళు మాట్లాడి… డబ్బులు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది, పెట్టిన రేటు కి వచ్చిన లెక్కలు ఏమాత్రం సంభందం లేకుండా ఉన్నాయని అడిగారని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, దాంతో పాటు ఈ ఒక్క సినిమా తోనే అయిపోలేదని, ఫ్యూచర్ లో మళ్ళీ మీరు…
మాతో డీల్ కి రావాల్సి ఉంటుంది అప్పుడు ఇది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు వచ్చిన నష్టానికి సొల్యూషన్ గా లాస్ ని తగ్గించాలని చెప్పారట. దాంతో నిర్మాత కూడా ఇప్పుడు ఫ్యూచర్ మూవీస్ పై ఇంపాక్ట్ పడుతుందేమో అన్న డౌట్ లో ఆలోచనలో ఉన్నాడని టాక్. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో త్వరలో తేలుతుంది అంటున్నారు.